Viral Video: అద్భుతం.. కారు వేగానికి ఛాలెంజ్ విసిరిన జింక.. చిరుతను మించిన వేగంతో పరెత్తింది..

Viral Video: అడవిలో క్రూరమృగాలు జింకలను వేటాడటం చూస్తూనే ఉంటాయి. ఈ వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో, టీవీ ఛానెళ్లలో తరచుగా వస్తూనే ఉంటాయి.

Viral Video: అద్భుతం.. కారు వేగానికి ఛాలెంజ్ విసిరిన జింక.. చిరుతను మించిన వేగంతో పరెత్తింది..
Deer Running

Updated on: Feb 25, 2022 | 6:55 AM

Viral Video: అడవిలో క్రూరమృగాలు జింకలను వేటాడటం చూస్తూనే ఉంటాయి. ఈ వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో, టీవీ ఛానెళ్లలో తరచుగా వస్తూనే ఉంటాయి. అయితే, సింహం, చిరుత వంటి జంతువుల వేట నుంచి తప్పించుకునేందుకు జింకలు సైతం చాలా వేగంగా పరుగెడుతాయి. ప్రాణాలు దక్కించుకునేందుకు వీలైనంత వేగంతో పరుగులు తీస్తాయి. జింక సాధారణ వేగం గంటకు 35 నుంచి 40 మైళ్లు. అదే కిలోమీటర్లలో చూసుకుంటే.. గంటకు 80 కిలో మీటర్ల వేగంతో పరుగెడతాయి. కానీ, ఇక్కడ ఓ జింక మాత్రం అంతకు మించిన వేగంతో పరుగెత్తి ఔరా అనిపించింది. అంతేకాదండోయ్.. ఏకంగా కార్ స్పీడ్‌కే ఛాలెంజ్ విసిరిగింది. కారును మించిన వేగంతో పరుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో ఓ కారు అడవి గుండా ఉన్న రోడ్డు మార్గంలో వెళ్తోంది. అయితే, కారుకు సమాంతరంగా ఓ జింక పరుగులు తీయడం ప్రారంభించింది. రన్నింగ్ రేస్ అనుకుందో ఏమో గానీ.. కారు స్పీడ్‌కు ఛాలెంజ్ విసురుతూ కారుతో సమాంతరంగా పరుగెత్తింది. అయితే, జింక పరుగెడుతున్న దృశ్యాన్ని కారులోని వ్యక్తులు తమ సెల్‌ఫోన్ కెమెరాలో బంధించారు. కారును మించిన వేగంతో జింక పరుగెత్తడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి జింక రా అయ్య.. ఇలా పరుగెడుతుంది అని కామెంట్స్ పెడుతున్నారు. ఇది చిరుతను మించిన వేగంతో పరుగెడుతోందంటూ మరికొందరు అంటున్నారు. ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Viral Video: సింహం భయపడటం ఎప్పుడైనా చూశారా?.. చెట్టును పట్టుకుని ఎలా విలపించిందో ఓసారి చూడండి..

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ నంబర్లు..

Viral Video: రైనో, అడవి దున్న మధ్య భీకర యుద్ధం.. వీడియో చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..

Loading...
Unable to load recommendations.
Follow Us