తెలంగాణలో కరోనాపై దుష్ప్రచారం..ముగ్గురి అరెస్ట్‌

కరోనా వైరస్‌ గురించి అతి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రెస్ మీట్‌లో హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినా కొంతమంది ఆ మాటలను పెడచెవిన పెట్టి ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టిస్తున్నారు.  దీంతో పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి తప్పుడు ప్రచారం చేసిన.. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. తప్పుడు సమాచారాన్ని సృష్టించిన ఇద్దరు వ్యక్తులతో పాటు..ఆ మెసేజ్‌లు పంపిన […]

తెలంగాణలో కరోనాపై దుష్ప్రచారం..ముగ్గురి అరెస్ట్‌
Follow us

|

Updated on: Mar 16, 2020 | 10:46 PM

కరోనా వైరస్‌ గురించి అతి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రెస్ మీట్‌లో హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినా కొంతమంది ఆ మాటలను పెడచెవిన పెట్టి ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టిస్తున్నారు.  దీంతో పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి తప్పుడు ప్రచారం చేసిన.. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.

తప్పుడు సమాచారాన్ని సృష్టించిన ఇద్దరు వ్యక్తులతో పాటు..ఆ మెసేజ్‌లు పంపిన వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ను కూడా అరెస్ట్‌ చేసి.. కేసు నమోదు చేశారు. ఆస్పత్రి బెడ్‌పై ఓ వ్యక్తి ఉన్న ఫొటోను ఇంటర్నెట్‌ నుంచి తీసుకుని, దాన్ని ఎడిట్‌ చేసి… కరోనాతో  గాంధీ ఆస్పత్రిలో మృతిచెందిన వ్యక్తిని భువనగిరి తరలించినట్లు వీరు వదంతులు సృష్టించారు. ఈ పోస్ట్‌ను క్రియేట్ చేసిన వ్యక్తి, దాన్ని వాట్సాప్ గ్రూప్‌కు ఫార్వార్డ్ చేసిన వ్యక్తి, ఆ గ్రూప్ అడ్మిన్ ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఎటువంటి రూమర్స్ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.