Telangana: మూడు రోజులుగా చెరువులో ఇరుక్కుపోయిన శునకం.. ఎలా కాపాడారో చూడండి

| Edited By: Narender Vaitla

Nov 28, 2024 | 8:12 PM

ఓ శునకం అనుకోకుండా చెరువులో పడింది. బయటకు రావడం ఎలాగో తెలియక చెరువులోనే ఇరుక్కుపోయింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు రోజుల పాటు శునకం చెరువులోనే ఉండిపోయింది. దీంతో చివరికి కొందరు యువకులు ఆ శునకాన్ని చాకచక్యంగా రక్షించి, ఒడ్డుకు చేర్చారు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌ అవుతోంది..

Telangana: మూడు రోజులుగా చెరువులో ఇరుక్కుపోయిన శునకం.. ఎలా కాపాడారో చూడండి
Viral
Follow us on

అనుకోకుండా ఆ కుక్క చెరువులో పడి ఇరుక్కు పోయింది. ఒడ్డుకి వచ్చే మార్గం లేక ఆకలితో అలమటిస్తూ కేకలు పెడుతూ అరుస్తూ ఉంది. అటుగా వెళ్లే వ్యక్తులు ఎవరూ పట్టించు కోలేదు. బహుశా మనుషులు కానీ , ఏదైనా పశువులు పడి ఉంటే.. పట్టించుకుని.. కాపడేవారేమో.. కుక్క కనుక ఆర్త నాదాలు ఎవరికీ పట్టలేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రోజులుగా ఆ శునకం చెరువులో ఉండిపోయింది.

దీంతో ఆ శునకం గోడును విన్న కొందరు యువకులు రంగంలోకి దిగారు. చెరువులో పడి ఒడ్డుకు రాలేకపోయిన శునకాన్ని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఒడ్డుకు చేరిన శునకం బతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి వెళ్లి పోయింది. సమయస్ఫూర్తి తో శునకాన్ని కాపాడిన యువకులను పలువురు అభినందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో చెరువుమాధారం చెరువు నుంచి సాగర్ కాలువకు నీళ్లు వెళ్లే రెగ్యూలేటర్లో మూడురోజుల క్రితం ఓ శునకం ఇరుక్కుని బయటకు రాలేక అవస్థలు పడుతుంది.

 

చెరువులో ఇరుక్కుపోయిన శునకం ఆకలితో అరుస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. చిన్నతండాకు చెందిన కొందరు యువకులు ఆటుగా వెళ్తున్న సమయంలో శునకం అరుపులు విన్నారు. వెంటనే తమకు వచ్చిన ఆలోచనతో తాడు సాయంతో కష్టపడి శునకాన్ని బయటకు తీశారు. అనంతరం ఆహారం అందించి పంపించారు. ఆపదలో ఉన్న శునకాన్ని కాపాడిన యువకులను పలువురు అభినందించారు. కుక్కను కాపాడిన సమయంలో తీసిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా నెట్టింట వైరల్‌ అవుతోంది. యువకులు చేసిన పనికి అభినందనలు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..