Clay Ganesha: విద్యుత్ బల్బులో వినాయకుడు.. ఎలా తయారు చేయాలో చెప్పిన మెదక్ జిల్లా యువకుడు..

|

Sep 12, 2021 | 12:52 PM

ఆయనంటే అందరికీ ఇష్టమే. ఆయనకు పూజ చేయనిదే ఏపని చేయరు. అన్నింటికి మించి ఉత్సవాలు వచ్చాయంటే.. భక్తుల సందండే.. సందండి.. ఆ గణనాధునికి పూజలు చేయడం కోసం ఎదురుచూస్తున్నారు భక్తజనం.

Clay Ganesha: విద్యుత్ బల్బులో వినాయకుడు.. ఎలా తయారు చేయాలో చెప్పిన మెదక్ జిల్లా యువకుడు..
Ganesh
Follow us on

ఆయనంటే అందరికీ ఇష్టమే. ఆయనకు పూజ చేయనిదే ఏపని చేయరు. అన్నింటికి మించి ఉత్సవాలు వచ్చాయంటే.. భక్తుల సందండే.. సందండి.. ఆ గణనాధునికి పూజలు చేయడం కోసం ఎదురుచూస్తున్నారు భక్తజనం. అంతే కాదు ప్రత్యేకంగా నిలిచేందుకు ప్రయత్నిస్తుంటారు. తమకు తోచిన రీతిలో ఆయనను తయారు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒకరు గుండు సూది చెక్కితే… మరొకరు పెన్సిల్ కొనపై ఆ వినాయకుడిని చెక్కి తన ప్రత్యేకను నిలుపుకున్నారు. ఇదలివుంటే మెదక్ జిల్లాకు చెందిన ఓ యుకుడు బల్బులో మట్టి విగ్రహాన్ని తయారు చేసి తన ప్రతిభను ప్రదర్శించాడు.

అల్లదుర్గం మండలం గడిపెద్దపూర్ గ్రామానికి చెందిన బచ్చలి మోహన్ అనే డిగ్రీ విద్యార్తి విద్యుత్ బల్బు లో వినయక విగ్రహాన్ని తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.వినాయక నవరాత్రి ఉత్సవాలు రావడంతో గత పదిరోజులుగా శ్రమించి ఈ అద్భుతం చేశానని మోహన్ అంటున్నారు.చిన్న తనం నుండి ఏదో కొత్తగా చెయ్యాలనే ఆతృత శ్రమ తనను ఈ స్థాయికి చేర్చిందని అంటున్నారు.

గతంలో ఇలాంటి అద్భుతాలు చేసి జిల్లా కలెక్టర్ ప్రశంసలు పొందారు.బల్బు లో విగ్రహం తయారు చేయడం చూసిన వారంతా మోహన్ కళను ప్రశంసించారు. అతని కుటుంబసభ్యులు సైతం ఆనందాన్ని వెక్తంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Chirutha: అనుకున్నట్లుగానే చిక్కింది.. ఫారెస్ట్ అధికారుల ప్లాన్ ఫలించింది.. బోన్‌లో పడిన చిరుతను..

Biryani: బిర్యానీ తిన్నారు.. చికెట్ వంటకాలు లాగించారు.. ఇంటికి వెళ్లారు.. కట్ చేస్తే..