Mulugu: తునికాకు సేకరణకు వెళ్లిన యువతి మిస్సింగ్‌..గాల్లోనే తెలివిగా మహిళను గుర్తించిన పోలీసులు..ఎలాగంటే..

|

May 14, 2022 | 9:40 PM

అడవిలో తునికాకు సేకరణ కోసం వెళ్ళిన ఓ మహిళ తప్పిపోయింది. తల్లిదండ్రుల, గ్రామపెద్దల ఫిర్యాదుతో మహిళను కాపాడిన పోలీసులు..భూపాలపల్లి మండలం ఆముదాలపల్లి అటవీ ప్రాతంలో శీరీషను గుర్తించిన పోలీసులు..యువతిని కనిపెట్టేందుకు పోలీసులు తెలివిగా..

Mulugu: తునికాకు సేకరణకు వెళ్లిన యువతి మిస్సింగ్‌..గాల్లోనే తెలివిగా మహిళను గుర్తించిన పోలీసులు..ఎలాగంటే..
Missing Woman
Follow us on

అడవిలో తునికాకు సేకరణ కోసం వెళ్ళిన ఓ మహిళ తప్పిపోయింది. తల్లిదండ్రుల, గ్రామపెద్దల ఫిర్యాదుతో మహిళను డ్రోన్ కేమేరాల సహాయంతో గుర్తించిన పోలీసులు..సదరు మహిళను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని సుబ్బక్క పల్లి గ్రామానికి చెందిన బండారి శిరీష అనే మహిళ తునికాకు సేకరణకు తోటి కూలీలతో భూపాలపల్లి అడవుల్లోకి వెళ్లి తప్పిపోయింది. మే 13న ఉదయం శిరీష తప్పి పోవడం తో కూలీలు గ్రామ సర్పంచ్ సుమన్ కు సమాచారం ఇచ్చారు. సర్పంచ్ గ్రామస్తులతో కలిసి భూపాలపల్లి అడవుల్లో వెతికినా ఆచూకి తెలియకపోవడంతో, ఆ మర్నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రాకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ ములుగ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఫారెస్ట్, పోలీస్ అధికారులకు శిరీషాను గుర్తించాల్సిందిగా ఆదేశాలు జారిచేశారు. వెంటనే రెండు డ్రోన్ కెమెరా లతో రంగంలోకి దిగిన అధికారులు, సుబ్బక్క పల్లి గ్రామస్థులతో పాటు శిరీష కోసం అడవుల్లో బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు ముమ్మరం చేసారు. తెలివిగా డ్రోన్ కెమెరాలను ఉపయోగించి అడవిని జల్లెడ పట్టారు పోలీసులు. గత రెండు రోజుల నుండి వెతకగా శనివారం ఉదయం డ్రోన్ కేమెరాల సహాయంతో ఫారెస్ట్ లో ఉన్న శిరిషను గుర్తించారు. భూపాలపల్లి మండలం ఆముదాలపల్లి అటవీ ప్రాతంలో శీరీషను గుర్తించిన పోలీసులు ఆమె తల్లిదండ్రులకు చూపించారు. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత ఆసుపత్రికి తరలించారు. అడవిలో మావోస్టుల కదలికల కోసం పోలీసులు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఆ డ్రోన్ కెమెరా సహయంతో శిరీష అనే మహిళ ప్రాణాలు కూడా కాపాడగలిగారు. శిరీష దొరకడం పట్ల కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సుబ్బక్క పల్లి పరిపాలన పరంగా భూపాల్ పల్లి మండలం లో ఉంటుంది. కానీ పోలీస్ స్టేషన్ పరిధి మాత్రం ములుగు జిల్లా వెంకటాపూర్ పరిధిలోకి వస్తుంది. కాగా, అడవిలో తప్పిపోయిన శిరీష దోరకగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులను కోనియాడారు.

 

Kamareddy: మరో నవవధువు మిస్సింగ్‌ కలకలం..పెళ్లైన మూడు నెలలకే అదృశ్యమైన యువతి

Moda Kondamma Jatara :కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి..అక్కా చెల్లెళ్లతో నైవేధ్యం ఆరగిస్తుండగా చూసిన భక్తుడు!

Bihar: ఎస్బీఐలో భారీ చోరీ..పని చేసే బ్యాంకుకే కన్నం వేసిన కేటుగాళ్లు..ఏకంగా 2.8కేజీల బంగారం లూటీ

ఏయ్‌ ” బట్టతల’ అన్నారంటే తప్పదు భారీ మూల్యం..కోర్టు తీర్పు తెలిస్తే షాక్‌ అవుతారు..!

Hyderabad News :హైదరాబాద్‌లో దారుణం, తల్లి మృతదేహంతో మూడ్రోజులుగా ఇంట్లోనే ఉన్న కొడుకు..ఏం జరిగింది..?