Kamareddy: మరో నవవధువు మిస్సింగ్‌ కలకలం..పెళ్లైన మూడు నెలలకే అదృశ్యమైన యువతి

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లికూతుళ్లు షాకిస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఒకరు, ఉన్నత చదువులపై ఉన్న శ్రద్ధతో పెద్దలకు ఎదురు చెప్పలేక ఇంకొకరు అర్ధాంతరంగా తనువు చలిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే నిండు నూరేళ్ల జీవితాన్ని ముంగించేస్తున్నారు.

Kamareddy: మరో నవవధువు మిస్సింగ్‌ కలకలం..పెళ్లైన మూడు నెలలకే అదృశ్యమైన యువతి
Two Men Married
Follow us

|

Updated on: May 14, 2022 | 9:13 PM

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లికూతుళ్లు షాకిస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఒకరు, ఉన్నత చదువులపై ఉన్న శ్రద్ధతో పెద్దలకు ఎదురు చెప్పలేక ఇంకొకరు అర్ధాంతరంగా తనువు చలిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే నిండు నూరేళ్ల జీవితాన్ని ముంగించేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే అటు ఏపీ, ఇటు తెలంగాణలో ఇద్దరు నవ వధువులు బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు అందరినీ కలచి వేశాయి. మరోవైపు తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో పెళ్లైన మూడు నెలలకే యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. వివాహమైన మూడు నెలలకే వివాహిత కనిపించకుండా పోయింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి లో గల మధురా నగర్ కాలనీలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాలు పరిశీలించగా…మధురానగర్ కాలనీ లో నివాసముండే చల్ల దత్తు కు తాడ్వాయికి చెందిన యమునతో ఫిబ్రవరి 16 వ తారీఖున వివాహం జరిగింది. మూడు నెలలపాటు వీరి కాపురం సాఫిగానే సాగింది. కానీ, అంతలోనే భార్యాభర్తల మధ్య కొద్దిరోజులుగా గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మే 13న దత్తు పనులకు వెళ్లిన తర్వాత యమున తన తల్లి గారింటికి వెళ్తున్నానని పక్కనే ఉంటున్న బంధువులకు చెప్పి వెళ్ళింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త దత్తు ఆందోళనకు గురయ్యాడు. బంధువులు, స్నేహితుల ఇంటి వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. యమున ఆచూకీ కోసం చాలాచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో దత్తు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దత్తు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యమున మిస్సింగ్‌పై పోలీసులను వివరణ కోరగా ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతూ భర్త దత్తు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.