Khammam Lok Sabha constituency: ఖమ్మం లోక్ సభ స్థానంపైనే అందరి ఫోకస్ ఉంది. ఇక్కడి నుంచి బీజేపీ తరపున తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు. అటు కాంగ్రెస్ నుంచి రఘురాం రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నిలబడ్డారు. ప్రచారంలో ఎవరూ తగ్గడం లేదు. ముగ్గురూ విజయం కోసం పోరాడుతున్నారు. అటు పార్టీలు కూడా ఖమ్మం లోక్ సభ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే ఖమ్మం జిల్లా చారిత్రక, రాజకీయ, సామాజిక, భౌగోళిక నేపథ్యం చిన్నదేమీ కాదు. ఖమ్మానికి పొలిటికల్ గేట్ వే అని పేరు. తెలంగాణ మొత్తానిది ఒక దారి.. ఖమ్మంది మరో దారి అన్నట్టుగా ఉంటుంది. అందుకే ఇక్కడ రాజకీయ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. తెలంగాణ మలి ఉద్యమం ఉధృతంగా సాగినా సరే.. ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్, టీడీపీ వైపే ప్రజలు నిలబడ్డారు. 2014లో, తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో టీడీపీ, వైసీపీ అభ్యర్ధులను గెలిపించారు ఇక్కడి ప్రజలు. ఇంత వైవిధ్యానికి కారణం.. ఇది రాష్ట్ర సరిహద్దు జిల్లా కావడమే. ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్ కు బోర్డర్ లో ఉంటుందీ జిల్లా. తెలంగాణ మలి ఉద్యమ పోరాటం హోరుగా సాగింది. నిజమే. కాని, ఖమ్మం జిల్లాకి ఉన్న పేరే పోరాటాల గడ్డ. అందుకే, దశాబ్దాలుగా ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చూసిన ఖమ్మం జిల్లా ప్రజలు విభిన్న తీర్పు ఇస్తుంటారు. జిల్లాల పునర్విభజనకు ముందు ఉమ్మడి...