Rain Alert: బీ ఆలర్ట్‌.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

|

Sep 27, 2024 | 6:47 AM

ఇక విదర్భ ,ఛత్తీస్‌గడ్, జార్ఖండ్ ,ఉత్తర బంగ్లాదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు మరి కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్..

Rain Alert: బీ ఆలర్ట్‌.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
Rain Alert
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో భాగంగానే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. తెలంగాణతో పాటు, ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తర మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఇక విదర్భ ,ఛత్తీస్‌గడ్, జార్ఖండ్ ,ఉత్తర బంగ్లాదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు మరి కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఏపీలోనూ జోరుగా వానలు..

ఇక గత కొన్ని రోజుల క్రితం ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. భారీ వరదలు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాయి. కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో పలు చోట్ల పంటలన్నీ మునిగిపోయాయి. అయితే ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టగా తాజాగా మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కాకినాడ, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడలో వర్షం కురిసింది.

ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. ఉత్తర కోస్తాంధ్రలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షపాతం మరికొన్ని రోజులు కొనసాగుతుంది. ఇకపోతే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా, ఒడిశా మధ్య సముద్రం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..