
ఈ మధ్య విషసర్పాల కంటే కొండచిలువలే ఎక్కువగా సంచరిస్తున్నాయి.. కొండ చిలువలు జనం మధ్యకు వచ్చి హడలెత్తిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మూగజీవులను మింగి జనాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. తాజాగా హనుమకొండ శివారు కోమటిపల్లితండా సమీపంలో భారీ కొండచిలువ ఓ ఇంటి ప్రహరీ పైన ప్రత్యక్షమవ్వడం అక్కడి ప్రజలను హడలెత్తిపోయేలా చేసింది. హనుమకొండలోని కోమటిపల్లి తండా నిరూప్ నగర్ వద్ద భారీ కొండ సిలువ ప్రత్యక్షమైంది. రెండు ఇళ్ల మధ్య ఉన్న ప్రహరీ గోడ పైన కొండచిలువ నెమ్మదిగా కదులుతూ కనిపించింది. తెల్లవారుజామున ఈ కొండచిలువను చూసి ఉలిక్కిపడ్డ స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఆ కొండచిలువ ఎటునుంచి వచ్చిందో వారికి అర్థంకాక ఆందోళన చెందుతున్నారు..13 అడుగుల పొడవున్న బారి కొండచిలువ ఇళ్ల మధ్యకు రావడంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న జనమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. ఈ ప్రాంతంలో ఇంకా ఎన్ని కొండచిలువలు ఉన్నాయో.. అవి ఎవరి ప్రాణాలకు ముప్పు తెస్తాయో అని భయందోళన చెందుతున్నారు.
సుమారు 13 ఫీట్ల పొడవున్న ఈ భారీ కొండచిలువ ఆ ప్రహరీ గోడ పై తిష్టవేసి దాదాపు రెండు గంటలకు పైగా హల్చల్ చేసింది.. చివరకు నెమ్మదిగా ప్రహరీ గోడ దిగి పక్కనే ఉన్న చెట్లలోకి వెళ్లిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..