Warangal: ‘అమ్మాయిలూ ప్రేమ పెళ్లితో మోసపోకండి’.. కన్నీరుమున్నీరవుతూ సూసైడ్ అటెంప్ట్ చేసిన యువతి..

|

Sep 28, 2022 | 9:42 AM

Warangal: వారు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏర్పడిన పరిణామాలే ఆ యువతిని ఆత్మ హత్యకు..

Warangal: ‘అమ్మాయిలూ ప్రేమ పెళ్లితో మోసపోకండి’.. కన్నీరుమున్నీరవుతూ సూసైడ్ అటెంప్ట్ చేసిన యువతి..
Love Marriage Failure
Follow us on

వారు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏర్పడిన పరిణామాలే ఆ యువతిని ఆత్మ హత్యకు ప్రేరేపించాయి. భర్త – అత్తమామలు వరకట్నం కోసం నరకం చూపడంతో ఓ యువతి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు యత్నించింది.. భర్త వేధింపులు భరించలేక పోలీసులకు పిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యకు యత్నించి ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతుంది.

వివరాల్లోకెళితే.. వరంగల్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన యువతి నూర్జహాన్.. ఇదే గ్రామానికి చెందిన శరత్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. కులమతాలు వేరైనా ప్రేమే ప్రాణం – తనువు చాలించేవరకు కలిసి జీవించాలని కలలుగని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నూర్జహాన్ తన మతం మార్చుకుంది. భర్తే సర్వస్వమని నమ్మి హిందూ స్త్రీగా మారింది. కానీ పెళ్లయిన కొద్దిరోజులకే వేధింపులు మొదలయ్యాయి. భర్త శరత్ తో పాటు, అతని తల్లిదండ్రులు వరకట్నం కోసం వేధిస్తున్నారని నూర్జహాన్ పోలీసులకు పిర్యాదు చేసింది.

కొద్దిరోజుల క్రితం సుబేధారిలోని మహిళా పోలీస్ స్టేషన్లో బాధితురాలు పిర్యాదు చేసింది. పోలీసులు ఎలాంటి న్యాయం చేయకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన నూర్జహాన్ ఆత్మహత్యకు సిద్ధమైంది.

ఇవి కూడా చదవండి

ఆడపిల్లలు ప్రేమలో పడి మోసపోవద్దని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు యత్నించింది. పురుగుల మందు సేవించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నూర్జహాన్ ను స్థానికులు గమనించి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..