కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని,డాక్టర్ ప్రీతి మృతిపై కీలక విషయాలు బయటపెట్టారు వరంగల్ సీపీ రంగనాథ్. ప్రీతి మృతికి ర్యాగింగ్ అనేది నిర్దారణైందన్నారు. ప్రీతి మృతికి సూసైడ్ లేదా కార్డియాక్ అరెస్ట్ కారణం అయి ఉండవచ్చని చెప్పారు. హత్య అనే కోణంలో విచారణ జరిపాం.. ఎక్కడా ఆధారాలు లభించలేదన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. నిందితులకు 306 సెక్షన్ కింద పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు సీపీ రంగనాథ్. అయితే, ప్రీతి మృతికి సూసైడ్ లేదా కార్డియాక్ అరెస్ట్ కారణం కావొచ్చన్నారు. ప్రీతి అసలెలా చనిపోయిందో తేలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు. అయితే, హత్య కోణంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు.
ఇకపోతే, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ అనస్థీషియ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని తెలిసింది.. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో స్పృహ లేని స్థితిలో పడి ఉన్న ప్రీతికి ఎంజీఎం ఆసుపత్రిలోనే మొదట అత్యవసర చికిత్స అందించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో.. అదే రోజు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రీతి ప్రాణాలు కోల్పోయింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..