Uttam Kumar Reddy: కమీషన్ల కోసమే బీఆర్‌ఎస్‌ ప్రాజెక్టులు నిర్మించింది.. మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు

|

Jul 28, 2024 | 3:47 PM

రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేతస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పనులు చేపట్టాలని సూచించారు. ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేతస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పనులు చేపట్టాలని సూచించారు. ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పై పలు విమర్శలు చేశారు. కమీషన్ల కోసం బీఆర్‌ఎస్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు నిర్మించిందంటూ మంత్రి ఆరోపించారు. తాము ఐదేళ్లలో చిత్తశుద్ధితో ప్రాజెక్టులు నిర్మిస్తామని.. స్పష్టంచేశారు. కాళేశ్వరంపై కేటీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని.. కేటీఆర్‌ జోసెఫ్‌ గోబెల్స్‌గా పేరు మార్చుకోవాలన్నారు. కేటీఆర్‌ అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు పనులు ముందు కొనసాగించి.. ఆ తర్వాత ఎందుకు డిజైన్‌ మార్చారు? అంటూ మంత్రి బీఆర్ఎస్ ను ప్రశ్నించారు.

ఈ ఆర్థిక సంవత్సరం నీటిపారుదలశాఖలో రూ.10,820 కోట్ల మేర పనులకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిందని.. ఈ పనులపై రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పనుల పురోగతిపై సమీక్షిస్తామని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..