Telangana: హైదరాబాద్‌లో మరో ఆరు మెట్రో బస్సులు.. ఏయే రూట్లలో అంటే..

| Edited By: Shaik Madar Saheb

Jun 25, 2023 | 6:41 AM

హైదరాబాద్‌ నగరంలోని మరో కొత్త రూట్‌లో మరిన్ని సిటీ బస్సులు తిరగనున్నాయి. మేడ్చల్ ప్రాంతం నుంచి మెహదీపట్నం దాకా కొత్తగా ఆరు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను నడపనున్నారు. ఈ విషయన్ని ఆర్టీసీ సికింద్రాబాద్ అధికారి సీహెచ్ వెంకన్న వెల్లడించారు. అయితే ఈ ఆరు బస్సులు కూడా ప్రతిరోజు 24 ట్రిప్పులు తిరుగుతాయని చెప్పారు.

Telangana: హైదరాబాద్‌లో మరో ఆరు మెట్రో బస్సులు.. ఏయే రూట్లలో అంటే..
TSRTC Offer
Follow us on

హైదరాబాద్‌ నగరంలోని మరో కొత్త రూట్‌లో మరిన్ని సిటీ బస్సులు తిరగనున్నాయి. మేడ్చల్ ప్రాంతం నుంచి మెహదీపట్నం దాకా కొత్తగా ఆరు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను నడపనున్నారు. ఈ విషయన్ని ఆర్టీసీ సికింద్రాబాద్ అధికారి సీహెచ్ వెంకన్న వెల్లడించారు. అయితే ఈ ఆరు బస్సులు కూడా ప్రతిరోజు 24 ట్రిప్పులు తిరుగుతాయని చెప్పారు. జూన్ 26 నుంచి వీటి సేవలు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 6.40 AM గంటల నుంచి రాత్రి 7.20 PM వరకు మేడ్చల్ నుంచి మెహదీపట్నం వరకు ఈ సేవలు ఉంటాయని తెలిపారు

అలాగే 8.20 AM గంటల నుంచి రాత్రి 9.05 PM గంటల వరకు మెహదీపట్నం ప్రాంతం నుంచి మేడ్చల్ వరకు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. అయితే గతంలో ఈ మార్గాల్లో వెళ్లే ప్రయాణికుల రవాణా చాలా ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త మెట్రో సేవలు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటాయని.. అందుకే ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చామన్నారు. అలాగే ప్రయాణికులు ఎక్కవ మంది ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి