Disha Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు.. హైపవర్ కమిషన్ ముందుకు సజ్జనార్..

| Edited By: Anil kumar poka

Oct 07, 2021 | 9:37 PM

Disha Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు విచారణలో స్పీడ్ పెంచింది హైపవర్ కమిషన్. ఈ విచారణలో భాగంగానే ఇవాళ హైపవర్ కమిషన్ ముందుకు

Disha Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు.. హైపవర్ కమిషన్ ముందుకు సజ్జనార్..
Sajjanar
Follow us on

Disha Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు విచారణలో స్పీడ్ పెంచింది హైపవర్ కమిషన్. ఈ విచారణలో భాగంగానే ఇవాళ హైపవర్ కమిషన్ ముందుకు మరోసారి వెళ్లబోతున్నారు ఐపీఎస్ సజ్జనార్‌. ఇప్పటికే రెండుసార్లు విచారణ కమిషన్ ముందు హాజరైన సజ్జనార్.. ఇవాళ మూడోసారి హాజరుకాబోతున్నారు. అయితే, ఇవాళ ఆయన ఇవ్వబోతున్న స్టేట్‌మెంట్ ఈ విచారణలో కీలకం కాబోతున్నదని అధికార వర్గాలు చెబుతున్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది హైపవర్ కమిషన్. బాధిత కుటుంబాలు, సిట్ ఛీప్ మహేష్ భగవత్, పంచనామా నిర్వహించిన అధికారులు, క్లూస్ టీమ్‌, ఇతర సాక్ష్యుల వాంగ్మూలాలను కమిషన్ నమోదు చేసింది. కాగా, అప్పుడు సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్.. ఇవాళ విచారణ కమిషన్ ముందు ఏం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకుని తదుపరి నివేదికను రూపొందించనుంది హైపవర్ కమిషన్.

హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను 2019 డిసెంబర్ 6వ తేదీన షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. దీనిని సుమోటోగా స్వీకరించిన హ్యూమన్ రైట్స్ కమిషన్.. ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు కోసం హైపర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా హెచ్ఆర్‌సీ తదుపరి చర్యలు తీసుకోనుంది.

Also read:

Nani: నాని భారీ ప్లాన్.. పాన్ ఇండియా దిశగా అడుగులు.. వీడియో

Life Certificate: విదేశాలలో నివసిస్తున్న పెద్దవారు లైఫ్ సర్టిఫికెట్‌ను ఎలా సమర్పించాలో.. స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి

Jai Bhim: సూర్య ‘జై భీమ్‌’ వచ్చేస్తోంది.. అమెజాన్‌లో.. వీడియో