పొలంలో బుల్లి లంకెబిందెలు.. దొరికిన బంగారు ఆభరణాలు

| Edited By:

Jun 03, 2020 | 1:32 PM

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో గుప్త నిధులు బయటపడ్డాయి. పూర్వ కాలంలో దొంగల భయంతో పలువురు నగలను, నాణేలను బిందెల్లో దాచి పూడ్చి పెట్టేవారు. ఈ విషయం వారికి తప్ప ఎవరికీ తెలీదు. అందుకే వాటికి గుప్త నిధులు అనే పేరు వచ్చింది. ఇలా కాలక్రమేణ అవి భూమిలో...

పొలంలో బుల్లి లంకెబిందెలు.. దొరికిన బంగారు ఆభరణాలు
Follow us on

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో గుప్త నిధులు బయటపడ్డాయి. పూర్వ కాలంలో దొంగల భయంతో పలువురు నగలను, నాణేలను బిందెల్లో దాచి పూడ్చి పెట్టేవారు. ఈ విషయం వారికి తప్ప ఎవరికీ తెలీదు. అందుకే వాటికి గుప్త నిధులు అనే పేరు వచ్చింది. ఇలా కాలక్రమేణ అవి భూమిలో కలిసిపోవడం జరుగుతుంది. పొలం దున్నే సమయాల్లో, ఇంటి నిర్మాణాల్లో అవి బయటపడుతుంటాయి.

తాజాగా వికారాబాద్ సుల్తాన్‌పూర్ గ్రామంలో బుల్లి ఆరు రాగి పాత్రల్లో బంగారు నాణేలు, ఆభరణాలు, వెండి నాణేలు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన సిద్దిఖీ తండ్రి యాకుబ్ అలీ తన పొలంలో మొరం తవ్వుతుండగా ఇవి దొరికాయి. ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి రెవెన్యూ అధికారులకు, పోలీసులకు తెలిసింది. గ్రామానికి చేరుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. యాకుడ్ అలీ ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా దొరికిన ఈ గుప్తనిధులు ప్రభుత్వ ఖజనాలోకి వెళ్లిపోనున్నాయి.

Read More:

జూన్ 11న ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కరోనాతో పాక్ మాజీ క్రికెటర్ మృతి

గాంధీ ఆస్పత్రిలో ప్రమాదం.. తృటిలో తప్పింది..

సీనియర్ నేత టీవీ చౌదరి కన్నుమూత