కొమురంభీం జిల్లాలోని కాగజ్ నగర్, సిర్పూర్ మండలాల్లో సంచరిస్తున్న పెద్దపులి స్థానిక జనాన్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఈ మ్యాన్ ఈటర్ ఇప్పుడు ఇక్కడు సంచరిస్తోందా? లేక మహారాష్ట్రకు వెళ్లిపోయిందా? అనేది అంతుచిక్కడం లేదు. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం మహారాష్ట్రకు వెళ్లిపోయిందని భావిస్తున్నామని చెబుతున్నారు. మూడు రోజులుగా 20 బృందాలు అడవిలో పులి కోసం గాలిస్తున్నాయి. ఇటిక్యల్ పాడ్ నుంచి పెద్దబండ మీదుగా చీలపల్లి , ఆరగూడ వైపు వెళ్లినట్టు గుర్తించామని చెబుతున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా అంతర్గాంలో ఓ పశువుపై పులిదాడి చేసింది. ఆరగూడ నుంచి మహారాష్ట్ర అంతర్గాం పది కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో ఈ పులి ఆ పులి ఒకటే అని భావిస్తున్నామంటున్నారు ఆసిపాబాద్ DFO నీరజ్ కుమార్. అయితే కొమరంభీమ్ జిల్లాలోని ప్రజలు మాత్రం పులి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
నవంబర్ 29న గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మిపై పులి దాడి చేయడంతో మృతి చెందింది. ఆ తర్వాత రోజు దుబ్బగూడలో సురేష్ అనే రైతుపై దాడి చేసింది. దీంతో పులి వరుసగా దాడులు చేయడంతో కొమరంభీమ్ జిల్లాలోని జనం భయంతో వణికిపోతున్నారు. పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే మ్యాన్ ఈటర్ మహారాష్ట్రకు వెళ్లినట్టు భావిస్తున్నారు. అయితే ఈ పులి ప్రవర్తన వింతగా ఉందంటున్నారు.
పొరుగున ఉన్న మహారాష్ట్ర అడవుల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి మళ్లీ తెలంగాణ అడవుల్లోకి వస్తోందన్నారు. ఆదివారం సిర్పూర్ (టి)లోని పెద్దబండ, ఇటిక్యాలపహాడ్ గ్రామాల సమీపంలో కనిపించిందని… దాని పగ్‌మార్క్‌లు ఒక చెట్టు దగ్గర రికార్డ్ అయ్యాయని.. పులి పర్యవేక్షించే బృందంలో భాగమైన అటవీ అధికారి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..