Telangana: ఒక పక్క పులి రాజు.. మరోపక్క గజ రాజు.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి

|

Nov 07, 2024 | 9:59 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్యమృగాల సంచారంతో ప్రజలు బెంబేలెత్తున్నారు. సహ్యాద్రి అటవీ ప్రాంతంలో వన్యమృగాల సంచారమే కనిపిస్తోంది. ఇటు రైతులకు అటు అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి

Telangana: ఒక పక్క పులి రాజు.. మరోపక్క గజ రాజు.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి
Tiger Tension On Adilabad
Follow us on

అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వన్యమృగాల దాడులతో వణికిపోతోంది. సహ్యాద్రి అటవీ ప్రాంతంలో ఏ దిక్కున చూసిన వలస వస్తున్న వన్యమృగాల సంచారమే కనిపిస్తోంది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా పులుల దాడులు.. మంచిర్యాల జిల్లాల్లోకి కొత్తగా పులుల ఎంట్రీ.. కొమురంభీం ఆసిపాబాద్ జిల్లాలో పెరుగుతున్న వలస పులుల సంతతితో నలుదిక్కులు మావే అన్నట్టుగా కనిపిస్తుంది అడవుల జిల్లాలో పరిస్థితి. పులుల ఖిల్లాగా పేరున్న తడోబా, తిప్పేశ్వర్ అభయారణ్యాల నుండి వలస వస్తున్న పులులు గ్రామ సరిహద్దుల్లోకి ఎంట్రీ ఇస్తుండటమే ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్లో భయాన్ని రెట్టింపు చేస్తోంది. ఇటు రైతులకు అటు అటవీశాఖ అధికారులకు కంటిమీద కొనుకు లేకుండా చేస్తున్నాయి.

అదిగో పులి ఇదిగో తోక అనే రోజులు పోయాయి నిజంగానే పుల్లసంచారం పెరిగింది ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో పులుల వలస ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖలో ఒక ఇంత ఆనందాన్ని మరింత భయాన్ని పెంచుతుంది పులులకు తోడు చిరుతల సంచారం కూడా పెరగడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. నిర్మల్ అదిలాబాద్ మంచిర్యాల్ కొమరం భీం జిల్లాల్లో వరుసగా సంచరిస్తున్న వన్యమృగాలు అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువుల మందులపై దాడులు చేస్తున్నాయి దీంతో పశువులను కోల్పోతున్న పాడే రైతులు పులుల దాడుల నుండి తమ పశుసంపదను కాపాడాలని అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు అటు వన్యమృగాల నుండి జనాలకు ఇటు జనాల నుండి అటు మృగాలకు ప్రాణ హాన్ని జరగకుండా కంటిమీద కునుకు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఒకపక్క పులిలు, మరో పక్క గజరాజులు దాడులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి