Tiger Missing: కే-4 పులి ఇక లేనట్లేనా?.. రెండు నెలల నుంచి ఆచూకీ గల్లంతు.. అటవీశాఖ అధికారుల గోప్యత..

|

Mar 30, 2021 | 10:47 AM

Tiger Missing: కే-4 ఆడ పులి క్షేమంగానే ఉందా? రెండు నెలలుగా కనిపించకుండా పోయిన కే-4 పులి ఆచూకీ ఏమైంది. అటవీశాఖ...

Tiger Missing: కే-4 పులి ఇక లేనట్లేనా?.. రెండు నెలల నుంచి ఆచూకీ గల్లంతు.. అటవీశాఖ అధికారుల గోప్యత..
Tiger K4
Follow us on

Tiger Missing: కే-4 ఆడ పులి క్షేమంగానే ఉందా? రెండు నెలలుగా కనిపించకుండా పోయిన కే-4 పులి ఆచూకీ ఏమైంది. అటవీశాఖ అధికారులు ఎందుకు గోప్యత పాటిస్తున్నారు. సమాచారం బయటకి పొక్కకుండా కింది స్థాయి సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారా?.. ఇప్పుడివే ప్రశ్నలు అందరినీ తొలచివేస్తున్నాయి. వివరాల్లోకెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో కే-4 పులి సంచరిస్తుండేది. 2017లో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని నడుము చుట్టూ, తుంటి భాగంలో ఇనుప తీగ ఉండటంతో ఆ గాయంతోనే కొన్నేళ్లుగా కే-4 పులి సంచరిస్తుంది. అయితే, 2018లో కే-4 పులిని కాపాడేందుకు అటవీశాఖ అధికారులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. అప్పటి నుంచి ఆ పులిని మూడేళ్లుగా కే 4ను ట్రాక్ చేస్తున్నారు. అయితే, గత రెండు నెలలుగా కే-4 పులి స్పెషల్ టీమ్ ట్రాక్‌కు చిక్కడం లేదు. చెన్నూరు మండలంలోని సంకారం, కోటపల్లి, నీల్వాయి అటవీ ప్రాంతాల్లో మూడు బేస్ క్యాంప్‌లను ఏర్పాటు చేసి మరీ విస్తృతంగా గాలింపు చేపట్టారు.

అయినా పులి ఆచూకీ చిక్కలేదు. 62 రోజులుగా పులి జాడ ఎక్కడా కనిపించకపోవడం కలకలం రేపుతోంది. ఇక కే-4 పులి సమాచారంపై అటవీశాఖ అధికారులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. పులి మిస్సింగ్‌కు సంబంధించిన సమాచారం బయటికి పొక్కకుండా కింది స్థాయి సిబ్బందికి హెచ్చరికలు కూడా జారీ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై అటవీశాఖ అధికారులను మీడియా ప్రతినిధులు సైతం ప్రశ్నించగా.. స్పష్టతనివ్వకుండా దాటవేశారు. అధికారులు ఇంతలా గోప్యత ప్రదర్శించడానికి గల కారణమేంటనేది తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే.. నాలుగేళ్లకుపైగా మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ డివిజన్‌లోని చెన్నూరు, కోటపల్లి, నీల్వాయి ప్రాంతాల్లో కే-4 ఆడపులి సంచరించింది. ఈ పులి వయసు దాదాపు ఐదేళ్లు ఉంటుంది.

Also read:

India Corona Cases Update: భారతదేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఏకంగా 56వేల కేసులు నమోదు..

Vegetable Powders: వేసవిలో పచ్చళ్ళు, వడియాలే కాదు.. కొన్నిరకాల కూరగాయలతో పొడులను కూడా తయారు చేసుకోవచ్చు తెలుసా..!

Kakinada GGH: ప్రభుత్వాసుపత్రి వద్ద పది రూపాయలకే ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణలు.. రోగులకు స్పెషల్ మెనూ కూడా