Telangana: తెలంగాణలో మలి విడత నామినేటెడ్‌ పదవుల పందారం షురూ!

| Edited By: Balaraju Goud

Nov 21, 2024 | 7:27 PM

మొదటి దశలో 36 మందికి నామినేటెడ్ చైర్మన్‌ పదవులు భర్తీ చేయడంతో పాటు అనేక మార్కెట్ యార్డ్ కమిటీలు. దేవాదాయ శాఖ ట్రస్ట్ బోర్డు కమిటీలు. గ్రంథాలయ చైర్మన్లు, వివిధ రకాల కమిషన్లు ఏర్పాటు అయ్యాయి.

Telangana:  తెలంగాణలో మలి విడత నామినేటెడ్‌ పదవుల పందారం షురూ!
Revanth Reddy Mahesh Goud Deepdas
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో రాబోవు 20 రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీ పీసీసీ కార్యవర్గం కూర్పు పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. బుధవారం(నవంబర్‌ 20) రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాసంలో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి వచ్చే డిసెంబర్ 7వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వార్షిక విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాల వారీగా విజయోత్సవాలను నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల వారిగా కూడా నిర్వహించాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పలు అంశాలు నాయకుల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మన్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం.

మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తి కావడంతో ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న నాయకులతో సమావేశం అయ్యారు. సుదీర్ఘంగా దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం కొనసాగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న కుల గణన అంశం, వార్షిక విజయోత్సవాలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు నియామకము తదితర అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి వరంగల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న మొన్న రెండు రోజులు కొనసాగిన వార్షిక విజయోత్సవాలు, స్థితిగతులపై చర్చించారు. జన సమీకరణ, సమావేశ నిర్వహణపై, ప్రజల్లో వస్తున్న స్పందన తదితరాంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలతో పాటు నియోజకవర్గాల వారిగా ఈ సమావేశాలు నిర్వహించే విషయమై చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఇప్పటికే మొదటి దశలో 36 మందికి నామినేటెడ్ చైర్మన్‌ పదవులు భర్తీ చేయడంతో పాటు అనేక మార్కెట్ యార్డ్ కమిటీలు. దేవాదాయ శాఖ ట్రస్ట్ బోర్డు కమిటీలు. గ్రంథాలయ చైర్మన్లు, వివిధ రకాల కమిషన్లు ఏర్పాటు చేసినప్పటికీ, మరిన్ని పదవులు పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయత్వం అవుతోంది. ఇప్పటికి భర్తీ చేసిన 36 పదవులకు మరో 15 కార్పొరేషన్లు పెద్దవి భర్తీ చేయాల్సి ఉంది. మిగిలిన వాళ్లకు వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా, కమిషన్లలో సభ్యులుగా నియమించి పార్టీ కార్యకర్తల్లో సంతృప్తి పరచాలని చూస్తోంది. అదేవిధంగా పిసిసి కార్యవర్గం రూపకల్పనపై కూడా చర్చించినట్లు విశ్వసినీ వర్గాలు చెబుతున్నాయి.

మరోసారి గురువారం(నవంబర్‌ 21) మధ్యాహ్నం పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. అదేవిధంగా నియోజకవర్గాలలో జరుగుతున్న కులగణన ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తదితర వాటిపై కూడా చర్చించారు. నియోజకవర్గాల వారీగా వార్షిక విజయోత్సవాలను నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ వ్యాధికి సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..