Telangana: అన్నదాతకు ఎంత కష్టం.. సరికొత్త సమస్య ఎదుర్కొంటున్న సింగరేణి ప్రాంత రైతాంగం..!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు జోరు కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోనూ వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆరు జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్‌అలర్ట్ కొనసాగుతుండగా, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, భూపాలపల్లికి ఆరెంజ్‌ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.

Telangana: అన్నదాతకు ఎంత కష్టం.. సరికొత్త సమస్య ఎదుర్కొంటున్న సింగరేణి ప్రాంత రైతాంగం..!
Agriculture Field
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 20, 2024 | 12:15 PM

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు జోరు కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోనూ వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆరు జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్‌అలర్ట్ కొనసాగుతుండగా, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, భూపాలపల్లికి ఆరెంజ్‌ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంతో మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, కళ్యాణి ఖని, ఆర్కే ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. దీంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టి, బొగ్గు తరలించే భారీ వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేరిన వరద నీటిని భారీ మోటర్ల సహాయంతో బయటికి పంపిస్తున్నారు. వర్షం కారణంగా నాలుగు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని సింగరేణి అధికారులు ప్రకటించారు.

మరోవైపు నది పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాల్లో ఇసుక మేటలు వేస్తోంది. వర్షాకాలం రాగానే ఇతర ప్రాంత రైతులు సంబరపడిపోతే అక్కడి రైతులు మాత్రం భయం భయంగా కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. సింగరేణి పరిసర ప్రాంతాల్లోని రైతాంగం సరికొత్త సమస్యను ఎదుర్కొంటోంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాలతో పాటు సమీప గ్రామాల రైతులు తమ పంటల్లోకి వరద నీటితో పాటు ఓపెన్ కాస్ట్ బావుల నుండి మట్టి కొట్టుకు రాకుండా చూడాలని వేడుకుంటున్నారు. సింగరేణి సంస్థ బొగ్గును వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన ఓసీపీల వల్ల తమ పొలాలు మట్టిపాలవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి వరి నాట్లు వేసుకుంటే వర్షపు నీటితో పాటు ఓబీ మట్టి తమ పొలాల్లోకి వచ్చి చేరుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నాట్లు వేసిన వరి అంతా కూడా ఓపెన్ కాస్ట్ మట్టిపాలు అవుతోందని గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఒక్క కన్నాల గ్రామంలోనే సుమారు 50 ఎకరాల వరకు పంట పొలాలు ఓబి మట్టితో నిండిపోయాయి.

భూ సేకరణ జరిపిన సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ మైన్స్ ద్వారా బొగ్గు నిల్వలను వెలికి తీసుకుంటోంది. అయితే ఈ బావుల్లో మట్టిని వేరు చేసి బావికి బౌండరీలా కట్టలు వేయిస్తుంటుంది సింగరేణి సంస్థ. గుట్టలుగా పేరుకున్న ఓపెన్ కాస్ట్ మట్టి బయటకు రాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే వర్షాకాలం రాగానే సమీప గ్రామాల్లోని పంట పొలాల్లోకి వరద నీటి ప్రవహంలో కొట్టుకుంటూ వచ్చి చేరుతోంది. దీంతో రైతులు వేసిన వరినాట్లు మట్టికింద కూరుకపోతున్నాయి. దీంతో వరినాట్ల కోసం వెచ్చించిన ఖర్చులతో పాటు దిగుబడిపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోందని రైతులు చెప్తున్నారు. ఓపెన్ కాస్ట్ ద్వారా బొగ్గు సేకరణలో భాగంగా బయటకు వస్తున్న మట్టిని బావి చుట్టూ గుట్టలుగా పేరుస్తున్న అధికారులు వర్షాకాలంలో కిందకు జారకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

మట్టి కిందకు జారకుండా ఉండేందుకు కంచెలు కానీ ఇతరాత్ర జాగ్రత్తలు కానీ తీసుకున్నట్టయితే తమ పొలాలు బావుంటాయను అంటున్నారు. సింగరేణి అధికారులకు గతంలో గోడు వెల్లబోసుకున్నా ఫలితం లేకుండా పోయిందని కన్నాల రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరాకు రూ. 40 వేల వరకు వెచ్చించి వరి సాగు చేస్తుంటే, ఓపెన్ కాస్ట్ మట్టి పొలాలను ముంచెత్తి తీరని నష్టానికి గురి చేస్తోందంటున్నారు. తమకు పరిహారం ఇవ్వడంతోపాటు వరద నీటి ద్వారా ఓబి మట్టి దిగువ ప్రాంతానికి రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సింగరేణి సంస్థకు చెందిన లారీలను ఎక్కడికక్కడ నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు వానల బీభత్సం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ దండోరా వేసి చాటుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామంలో ప్రజలు వాగు వద్దకు రావద్దని, వాగు దాటే ప్రయత్నం చేయవద్దని డప్పు చాటింపు వేయిస్తున్నారు అధికారులు. గ్రామంలో ఉన్న కరెంట్ పోల్ లు ముట్టుకోవద్దని సూచించారు. గుండి పెద్ద వాగు వద్ద పోలీసుల పహారా ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

సింగరేణి నిర్లక్ష్యంతో రైతాంగం నోటిలో మట్టి..!
సింగరేణి నిర్లక్ష్యంతో రైతాంగం నోటిలో మట్టి..!
ఇప్పుడు ఈ మార్గంలో దూసుకుపోనున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్
ఇప్పుడు ఈ మార్గంలో దూసుకుపోనున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్
'బాబాయ్.. నువ్వు కేక..' స్కూటీ సెంటర్ స్టాండ్ వేయడం ఇంత ఈజీనా
'బాబాయ్.. నువ్వు కేక..' స్కూటీ సెంటర్ స్టాండ్ వేయడం ఇంత ఈజీనా
కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? గుండెపోటు వస్తున్నట్లు అర్థం
కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? గుండెపోటు వస్తున్నట్లు అర్థం
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
రైతులకు ఇస్తానన్న పైసలేవి? పల్లవి ప్రశాంత్‌ను ఏకిపారేశాడుగా..
రైతులకు ఇస్తానన్న పైసలేవి? పల్లవి ప్రశాంత్‌ను ఏకిపారేశాడుగా..
మైక్రోసాఫ్ట్ లోపం.. ఈ ఒక్క వీడియో చూస్తే పరిస్థితి అర్థమైపోతుంది
మైక్రోసాఫ్ట్ లోపం.. ఈ ఒక్క వీడియో చూస్తే పరిస్థితి అర్థమైపోతుంది
హీటెక్కిన చంద్రగిరి.. నేతల మధ్య ముదురుతున్న పంచాయితీ!
హీటెక్కిన చంద్రగిరి.. నేతల మధ్య ముదురుతున్న పంచాయితీ!
తెలుగువారి కోసం IRCTC జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర..
తెలుగువారి కోసం IRCTC జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర..
వామ్మో.. చెట్టు పైనుంచి ఏంటా సౌండ్స్ అని చెక్ చేయగా...
వామ్మో.. చెట్టు పైనుంచి ఏంటా సౌండ్స్ అని చెక్ చేయగా...
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?
పాములు పగబడతాయన్న ప్రచారం వెనుక అసలు కథ ఏంటి.?
పాములు పగబడతాయన్న ప్రచారం వెనుక అసలు కథ ఏంటి.?
బడ్జెట్ 2024 ఏపీకి ఏమిస్తారు.? చాలా ఆశలు పెట్టుకున్న ఏపీ..
బడ్జెట్ 2024 ఏపీకి ఏమిస్తారు.? చాలా ఆశలు పెట్టుకున్న ఏపీ..
బోరు నుంచి ఉబికి వస్తున్న నీళ్లు..
బోరు నుంచి ఉబికి వస్తున్న నీళ్లు..