ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త..వారికి నవంబర్ 14 నుంచి 9 కొత్త ప్రయోజనాలు!

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నెలవారీ సీజన్ టికెట్ (MST) విధానంలో కీలక మార్పులు చేస్తూ ఏకంగా తొమ్మిది కొత్త ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చింది. నవంబర్ 14 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. మహిళలు డీలక్స్, ఈ-డీలక్స్ బస్సుల్లో నెలంతా ప్రయాణించేందుకు కేవలం 15 రోజుల ఛార్జీ మాత్రమే చెల్లించే వెసులుబాటు కల్పించారు. నగరాల్లో MST పాస్ ఉన్నవారు ప్రతి ఆదివారం అన్ని సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అలాగే

ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త..వారికి నవంబర్ 14 నుంచి 9 కొత్త ప్రయోజనాలు!
Tgsrtc New Rules
Image Credit source: AI image

Updated on: Nov 14, 2026 | 8:33 PM

తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, సాధారణ ప్రయాణికుల కోసం ప్రభుత్వం, టీఎస్‌ఆర్టీసీ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో నెలవారీ సీజన్ టికెట్ విధానంలో సరికొత్త మార్పులు చేసింది. ఏకంగా తొమ్మిది కొత్త రాయితీలు, ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చింది. నవంబర్ 14 నుంచి ఈ కొత్త నిబంధనలు రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.

మహిళలకు ప్రత్యేక వెసులుబాటు:

మహాలక్ష్మి పథకం ద్వారా సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తుండగా, డీలక్స్, ఈ-డీలక్స్ బస్సుల కోసం ఆర్టీసీ కొత్త నెలవారీ పాస్ విధానాన్ని తెచ్చింది. మహిళలు ఈ బస్సుల్లో నెల మొత్తం ప్రయాణించేందుకు కేవలం 15 రోజుల ఛార్జీ మాత్రమే చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. గతంలో ఇది 20 రోజులుగా ఉండేది. దీనివల్ల మహిళా ప్రయాణికులకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం కలగనుంది.

ఆదివారాల్లో ఉచిత సిటీ బస్ ప్రయాణం:

హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ నగరాల్లో MST పాస్ ఉన్నవారు ప్రతి ఆదివారం అన్ని కేటగిరీల సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే ఎయిర్‌పోర్ట్ పుష్పక్ లైనర్ బస్సులు, ప్రభుత్వ సాధారణ సెలవు దినాలకు ఇది వర్తించదు. కేవలం ఆదివారాల్లో మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇతర ముఖ్యమైన ప్రయోజనాలు:

దూర పరిమితి తొలగింపు: నెలవారీ సీజన్ టికెట్ల జారీలో ఇప్పటివరకు ఉన్న దూర పరిమితులను ఆర్టీసీ తొలగించింది.

టోల్ ఛార్జీల తగ్గింపు: సాధారణ ప్రయాణికులకు పాస్ ధర తగ్గేలా, టోల్ ప్లాజా ఛార్జీలను 25 రోజుల బదులుగా కేవలం 20 రోజులకే లెక్కించనున్నారు.

కాంబి టికెట్ సదుపాయం: ఈ విధానం ద్వారా ప్రయాణికులు తమ పాస్ కంటే ఒక స్థాయి ఎక్కువ కేటగిరీ బస్సుల్లో (ఉదాహరణకు పల్లె వెలుగు పాస్‌తో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో) కేవలం 20 రూపాయల అదనపు చెల్లింపుతో ప్రయాణించవచ్చు.

దీర్ఘకాలిక పాస్‌లపై బోనస్ రోజులు: రెండు నెలల MST తీసుకుంటే అదనంగా 5 రోజులు, మూడు నెలల MST తీసుకుంటే అదనంగా 10 రోజుల వ్యాలిడిటీని ఉచితంగా ఇస్తారు.

ప్రజా రవాణాను ప్రోత్సహించే దిశగా ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. రోజూ బస్సుల్లో రాకపోకలు సాగించే వారికి ఈ కొత్త నిబంధనలు ఎంతగానో ఉపయోగపడతాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Loading...
Unable to load recommendations.
Follow Us