AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 1 Results: గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ఫలితాలు వచ్చేశాయ్‌! డైరెక్ట్‌ లింక్‌ ఇదే

తెలంగాణలో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు సోమవారం (మార్చి 10) తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో నేరుగా మార్కుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను ఈ కింది లింక్‌ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు..

TGPSC Group 1 Results: గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ఫలితాలు వచ్చేశాయ్‌! డైరెక్ట్‌ లింక్‌ ఇదే
TGPSC Group 1 Results
Srilakshmi C
|

Updated on: Mar 10, 2025 | 3:35 PM

Share

హైదరాబాద్, మార్చి 10: తెలంగాణలో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు సోమవారం (మార్చి 10) తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ)  చైర్మన్ బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఐడీ, మెయిన్స్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేసి నేరుగా ప్రాథమిక మార్కుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా మొత్తం 563 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ టీజీపీఎస్సీ చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు అక్టోబర్‌ 21వ తేదీ నుంచి అక్టోబర్‌ 27వ తేదీ వరకు 7 పేపర్లకు నిర్వహించారు. ఈ పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలు ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • తొలుత టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోమ్‌ పేజ్‌లో కనిపించే టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 లింక్‌పై క్లిక్‌ చేయాలి.
  • అనంతరం లాగ్‌ఇన్‌ వివరాలు నమోదు చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే స్క్రీన్‌పై టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ మార్కుల జాబితా కనిపిస్తుంది.
  • అనంతరం పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • దీనిని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా కమిషన్‌ తాజాగా విడుదల చేసిన గ్రూప్ 1 మెయిన్స్‌ ఫలితాల్లో ప్రాథమిక జాబితా మాత్రమే వెల్లడించింది. అభ్యర్ధులు తమ మార్కులపై సందేహాలుంటే వచ్చే 15 రోజుల్లోగా ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున చెల్లించి రీ కౌంటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసి 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ వెల్లడిస్తుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు..
క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు..
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..