AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ దసరా గిఫ్ట్.. ఈ సారి ముందుగానే.. రెడీగా ఉండండి..

ఇందిరమ్మ చీరలపై కీలక అప్డేట్ వచ్చింది. ఎప్పుడు పంపిణీ చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చింది. గత ఏడాది నవంబర్‌లో పంపిణీ చేయగా.. ఈ సారి ముందుగానే అందించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలోనే పంపిణీకి సిద్దమవుతోంది. దీంతో ఈసారి మహిళలు ముందుగానే అందుకోనున్నారు.

Telangana: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ దసరా గిఫ్ట్..  ఈ సారి ముందుగానే.. రెడీగా ఉండండి..
Indiramma Sarees
Venkatrao Lella
|

Updated on: Sep 06, 2026 | 8:26 AM

Share

తెలంగాణలోని మహిళలకు రేవంత్ సర్కార్ దసరా కానుక ప్రకటించింది. వచ్చే నెలలో దసరా పండుగ వస్తుండటంతో.. ముందుగానే మహిళలకు గిఫ్ట్ అందించనుంది. అవే ఇందిరమ్మ చీరలు. దసరా, బతుకమ్మ పండుగల సమయంలో ప్రతీ ఏడాది మహిళలకు చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా ప్రభుత్వం అందించనుండగా.. ఈ సారి ముందుగానే ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చీరలను అందిస్తోంది. ఇప్పటికే చీరల తయారీ వేగవంతం అవ్వగా.. ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. వచ్చే నెల 11వ తేదీ నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా వీటిని మహిళలకు అందించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

మారిన చీరల రంగు

ఈ సారి చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేసేందుకు సిద్దం చేస్తున్నారు. మొత్తం రూ.334 కోట్లు ఖర్చు చేస్తుండగా.. 95 లక్షల చీరలను సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే 30 లక్షల చీరల తయారీ పూర్తవ్వగా.. ఈ నెలాఖరులోగా మిగతా వాటిని కూడా పూర్తి చేయనున్నారు. ఇప్పటికే పూర్తయిన చీరలను జిల్లాలకు తరలిస్తున్నారు. గత ఏడాది ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న మహిళలకు చీరలను పంపిణీ చేయగా.. ఈ సారి ముందుగానే పంపిణీ చేయనున్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచే పంపిణీకి సిద్దంగా ఉంచాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో బతుకమ్మ, దసరా సందర్భంగా మహిళలకు చీరలు అందనున్నాయి. వచ్చే నెల 11న బతుకమ్మ పండుగ సందర్భంగా వీటిని అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది పాలపిట్ట రంగ చీరను అందించగా.. ఈ సారి చిలకపచ్చ రంగు చీరలను డిజైన్ చేశారు. ప్రతీ మహిళకు ఉచితంగా రెండు చీరలను అందించనున్నారు.

జిల్లాలకు తరలింపు

పంపిణీ తేదీపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ.. ఇప్పటికే జిల్లాలకు తరలిస్తుండటంతో అక్టోబర్‌లోనే పంపిణీ ఉంటుందని తెలుస్తోంది. ఈ సారి నాణ్యత, ప్యాకింగ్‌లో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. ప్రభుత్వం నుంచి తేదీ ఖరారు కాగానే.. స్థానిక యంత్రాంగం వీటిని మహిళలకు అందించనుంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు చేపడుతోంది. అందులో భాగంగా చీరలను కూడా పంపిణీ చేస్తోంది. మహిళలు ఈ చీరల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడెప్పుడు అందుతాయా అని ఎదురుచూస్తున్నారు.

Follow Us