డేటా చౌర్యం కేసులో ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ పై సీరియస్ అయ్యింది తెలంగాణ సిట్. విచారణకు హాజరుకాకపోవడంతో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సిట్ అధికారుల నోటీసులను బేఖాతరు చేసినందుకు తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. డేచా చౌర్యంపై ఇప్పటికే పోలీసుల విచారణ, కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ చుట్టే వ్యవహారం తిరుగుతోంది. కేసు విచారణలో అరెస్ట్ నుంచి తప్పించాలంటూ అశోక్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనంటూ కోర్టు ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. ఈ నెల 2, 3 తేదీల్లో అశోక్ కు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు స్పందించకపోవడంతో సోమవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. కేపీహెచ్బీలోని తన ఇంటికి నోటీసులు అంటించారు. బుధవారం తమ ముందు విచారణకు రావాలంటూ ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ ను ఆదేశించింది సిట్. 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిది. ఒక వేళ అశోక్ సిట్ ఆఫీసుకు వస్తే.. ఎలాంటి సమాచారం రాబట్టిలి..? డేటా చోరి ఎక్కడ, ఎలా జరిగింది..? అన్నదానిపై ప్రశ్నించేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసింది. అశోక్ విచారణకు హాజరుకాకపోవడంతో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.