TGSRTC Bus: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌ మృతి.. రోడ్డు పక్కన బస్సు ఆపడంతో ప్రయాణికులు సేఫ్‌

|

Oct 07, 2024 | 11:32 AM

ఒకే రోజు ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు గుండెపోటుతో మృతి చెందారు. విధినిర్వహణలో ఉన్న ఓ అర్టీసీ డ్రైవర్‌, మరో కండక్టర్‌ ఆన్‌డ్యూటీలో ఉండగానే వేర్వేరు ఘటనల్లో గుండెపోటుకు గురయ్యారు. వివరాల్లోకెళ్తే.. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం దుద్దెనపల్లికి చెందిన ఠాకూర్‌ రమేశ్‌సింగ్‌ (45) హుజూరాబాద్‌ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు...

TGSRTC Bus: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌ మృతి.. రోడ్డు పక్కన బస్సు ఆపడంతో ప్రయాణికులు సేఫ్‌
heart attack to TGSRTC bus Staff
Follow us on

హుజూరాబాద్‌, అక్టోబర్‌ 7: ఒకే రోజు ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు గుండెపోటుతో మృతి చెందారు. విధినిర్వహణలో ఉన్న ఓ అర్టీసీ డ్రైవర్‌, మరో కండక్టర్‌ ఆన్‌డ్యూటీలో ఉండగానే వేర్వేరు ఘటనల్లో గుండెపోటుకు గురయ్యారు. వివరాల్లోకెళ్తే.. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం దుద్దెనపల్లికి చెందిన ఠాకూర్‌ రమేశ్‌సింగ్‌ (45) హుజూరాబాద్‌ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. 15 రోజుల క్రితమే పరకాల డిపో నుంచి డిప్యూటేషన్‌పై ఆయన హుజురాబాద్‌కు వచ్చారు. ఎప్పటి మాదిరిగానే ఆదివారం డ్యూటీకి వచ్చాడు. బస్సులో ప్రయాణికులను ఎక్కించుకుని హుజూరాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు.

అయితే గజ్వేల్‌ సమీపంలోకి రాగానే డ్రైవర్‌ రమేశ్‌ సింగ్‌ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో సమయ స్పూర్తితో వెంటనే వస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. అనంతరం కండక్టర్‌, ప్రయాణికులకు విషయం చెప్పడంతో.. వారు అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటీన వచ్చి రమేశ్‌సింగ్‌ను గజ్వేల్‌ దవాఖానకు తరలించారు. అయితే అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే రమేశ్‌ సింగ్‌ మృతిచెందినట్టు తెలిపారు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

మరో ఘటనలో విధినిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు కండక్టర్‌ కూడా గుండెపోటుతో మృతి చెందాడు. చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన రాకం లింగమూర్తి (55) కరీంనగర్‌-2 డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆదివారం బస్టాండ్‌కు వచ్చి లింగమూర్తి.. బస్సు వద్దకు వెళ్తుండగా ఛాతీలో వొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆర్టీసీ సిబ్బంది కరీంనగర్‌లోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు నిర్ధారించారు. ఒకే రోజు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది గుండెపోటుకు గురవడంతో తోటి సిబ్బంది తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.