తెలంగాణ ప్రజలందరికీ గుడ్ న్యూస్.. ఒకేరోజు రెండు కొత్త పథకాలు.. ప్రతీఒక్కరూ బెనిఫిట్ పొందోచ్చు..
తెలంగాణ ప్రజలకు డబుల్ బొనాంజా. ఒకేరోజు రెండు పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 19వ తేదీన రెండు పథకాలను ఒకేసారి ప్రారంభించనుంది. ఇది తెలంగాణలోని ప్రజలందరికీ శుభవార్తగా చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా దాదాపు ప్రతీఒక్కరూ లబ్ది పొందనున్నారు.

తెలంగాణ ప్రజలకు డబుల్ ఢమాకా లాంటి వార్త. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ నెలలో ఒకేసారి రెండు పథకాలను మొదలుపెట్టింది. నవంబర్ 19వ తేదీన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని రెండు పథకాలను ప్రారంభిస్తుంది. వీటిల్లో ఒకటి కొత్త పథకం కూడా ఉంది. అదే ఇందిరమ్మ బీమా పథకం. నవంబర్ 19న సిద్దిపేటలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ స్కీమ్ ద్వారా రేషన్ కార్డు ఉన్న ప్రతీఒక్కరి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. కుటుంబ పెద్ద మరణిస్తే కుటుంబసభ్యులకు రూ.5 లక్షలు అందించనున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో కుటుంబానికి ఆర్ధికంగా అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది.
మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు
మహిళలందరికీ ఇందిరమ్మ చీరల పంపిణీకి రంగం సిద్దమైంది. ఈ నెల 19వ తేదీన నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. మహిళలకు ఇందిరమ్మ చీరలు అందించి రేవంత్ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయనుండగా.. జిల్లా, మండల కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పంపిణీ మొదలుపెట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఈ చీరలు అందించనున్నారు. వారం రోజుల్లో పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తమ సమీపంలో చీరలు పంపిణీ చేసే కేంద్రాల వద్దకు మహిళలు రేషన్ కార్డు తీసుకెళ్లాలి. అనంతరం అధికారులు వివరాలు నమోదు చేసుకుని చీరలు అందిస్తారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో సెర్ప్ ఈ కార్యక్రమం చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 95 లక్షల మంది మహిళలకు చీరలు అందించనున్నారు.
మారిన చీరల రంగు
అయితే ఈ సారి రంగు మారింది. గతంలో పాలపిట్ట రంగు చీరలు అందించగా.. ఇప్పుడు డిజైన్ మార్చారు. చిలుకపచ్చ రంగు బాడీపై ఎరుపు రంగు పట్టు, జరీ అంచులతో చీరలు తీర్చిదిద్దారు. శుభకార్యాలు, పండుగల సమయంలో కూడా ధరించే విధంగా అత్యంత క్వాలిటీతో కూడిన చీరలు తయారుచేశారు. ఆకట్టుకునే డిజైన్‌తో వీటిని తయారుచేశారు. ఈ చీరల కోసం ప్రభుత్వం రూ.334 కోట్లు ఖర్చు చేసింది. రెండు నెలల క్రితమే చీరలను తయారుచేయగా.. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీ మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ చీరలను మండల కేంద్రాలకు తరలించారు. పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
