Bird Walk Festival: ప్రకృతి ప్రేమకులకు తెలంగాణ సర్కార్ ఆహ్వానం.. అటవీ అందాలను చూసేయండి..

|

Feb 12, 2022 | 5:58 PM

Kavval Forest: ప్రకృతి అందాల పుట్టినిళ్లు అడవుల జిల్లా ఆదిలాబాద్ రారమ్మంటూ పిలుస్తోంది. పక్షుల కిలకిలరావాలు.. మైమరిపించే జలపాతాలు.. నీటి సరస్సులు..

Bird Walk Festival: ప్రకృతి ప్రేమకులకు తెలంగాణ సర్కార్ ఆహ్వానం.. అటవీ అందాలను చూసేయండి..
Kavval Forest
Follow us on

Kavval Forest: ప్రకృతి అందాల పుట్టినిళ్లు అడవుల జిల్లా ఆదిలాబాద్ రారమ్మంటూ పిలుస్తోంది. పక్షుల కిలకిలరావాలు.. మైమరిపించే జలపాతాలు.. నీటి సరస్సులు.. చెంగు చెంగున ఎగిరే వన్యప్రాణులు.. హాయిగా పచ్చని ప్రకృతిలో సేద దీరేందుకు వెలిసిన వెదురు మంచెలు ప్రకృతి ప్రేమికులకు ఆహ్వనం పలుకుతున్నాయి. విభిన్న రకాల పక్షుల రాకతో తొలిసారిగా జరుగుతున్న బర్డ్ వాక్ ఫెస్ట్ లో భాగంగా కవ్వాల్ అభయారణ్యం మరింత ముస్తాబై కనిపిస్తోంది.

అటవీశాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కవ్వాల్ అభయారణ్యంలో బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్ ప్రారంభమైంది. తెలంగాణ అటవీ సంపద, జీవ వైవిధ్యం గురించి విద్యార్థులు, పరిశోధకులు, పక్షి ప్రేమికులకు తెలిపేందుకు జన్నారం, ఖానాపూర్‌ డివిజన్లు మొదటిసారిగా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఫిబ్రవరి 12,13 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతోంది‌. ఒక్కొక్కరికి 1,500 రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు వసూలు చేశారు నిర్వహకులు. తొలిసారి కవ్వాల్‌ అభయారణ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండతో కేవలం 50 మందికి మాత్రమే అవకాశం కల్పించారు.

కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో చిరుతలు, తోడేళ్లు, అడవి కుక్కలు, మచ్చల జింకలు, అడవి పిల్లులు, దుప్పులు, అడవి దున్నల సంచారం ఎక్కువ. తాజాగా ఈ అభయారణ్యం లో 300కు పైగా పక్షి జాతుల సంచారం ఉన్నట్టుగా గుర్తించిన అటవీశాఖ.. ప్రకృతి ప్రేమికుల కోసం బర్డ్ వాక్ ను ఏర్పాటు చేసింది. కవ్వాల్ డివిజన్ లోని మైసమ్మకుంట, బైసన్‌కుంట, నీలుగాయికుంటతో పాటు కల్పకుంట, గోండుగూడ అటవీ ప్రాంతాల్లో పక్షి ప్రేమికులు రాత్రి వేళల్లో బస చేసేందుకు అటవీ ప్రాంతంలో బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేసారు అధికారులు.

Also read:

పాము, డేగల మధ్య పోరు ఎలా ఉంటుందో చూశారా.? డేగను పాము చూట్టేస్తే ఎంత భయంకరంగా ఉంటుందంటే.. వైరల్‌ వీడియో.

Medaram Jatara 2022: మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు. పెంపుడు కుక్కకు నిలువెత్తు బంగారం సమర్పించిన భక్తురాలు

Punjab Kings, IPL 2022 Auction: పంజాబ్ కింగ్స్ సొంతమైన ఢిల్లీ ప్లేయర్లు.. తొలి ట్రోఫీ కోసం భారీగా ఖర్చు..!