Audiobook Siddipet: రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో ఆడియో పుస్తకాలు… నేడు ప్రారంభించనున్న మంత్రి హరీష్‌ రావు.

|

Jul 28, 2021 | 6:42 AM

Audiobook Siddipet: మారుతోన్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కరోనా తదనంతర పరిణామాల తర్వాత ఆన్‌లైన్‌ చదువులకు ప్రాధాన్యత పెరిగింది...

Audiobook Siddipet: రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో ఆడియో పుస్తకాలు... నేడు ప్రారంభించనున్న మంత్రి హరీష్‌ రావు.
Audio Books Siddipet
Follow us on

Audiobook Siddipet: మారుతోన్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కరోనా తదనంతర పరిణామాల తర్వాత ఆన్‌లైన్‌ చదువులకు ప్రాధాన్యత పెరిగింది. విద్యా వ్యవస్థలో రోజురోజుకూ టెక్నాలజీ ప్రాధానత్య పెరుగుతోంది. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చినవే ఆడియో పుస్తకాలు. ఆడియో రూపంలో విద్యార్థులు పుస్తకాల్లోని పదాల ఉచ్ఛారణను సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి విధానంలో ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎన్‌సీఈఆర్‌టీ ఆడియో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే రాష్ట్ర స్థాయిలో మాత్రం ఇలాంటి అవకాశం లేదు. దీంతో ఈ విధానం దృష్టి సారించిన తెలంగాణలోని సిద్ధిపేట విద్యా శాఖ అధికారులు ఆ దిశగా అడుగులు వేశారు.

రాష్ట్రంలో తొలిసారిగా సిద్ధిపేటలో ఆడియో పుస్తకాలను రూపొందించారు. వీటిని నేడు (బుధవారం) రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు ప్రారంభించనున్నారు. ఈ పుస్తకాల రూపకల్పనకు అధికారులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఏడుగురు భాషా పండితుల సహాకారం తీసుకున్నారు. ఇందులో భాగంగా 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లోని 154 పాఠాలను 226 ఆడియో పుస్తకాలుగా రూపొందించారు. వీటిని విద్యామిత్ర యూట్యూబ్‌ ఛానల్‌లో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఎన్నో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టిన సిద్ధిపేట నుంచే ఈ కొత్త విధానం కూడా అమల్లోకి వస్తుండడం విశేషం.

Also Read: భూ సమస్య పరిష్కారం కోసం వృద్ధ దంపతుల పోరాటం.. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్‌కు వినతి

YS Sharmila: ఆత్మహత్యకు పాల్పడిన శ్రీకాంత్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ షర్మిల.. నిరుద్యోగ నిరాహార దీక్ష

ఈనెల 31లోపు పూర్తి చేయండి.. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌