AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం.. ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటెయ్యండి: సీఎం కేసీఆర్

Telangana Elections: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు.. ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఎలా ఉందో చూడండి.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం.. అంటూ బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ఏవేవో చెబుతారు.. వాటిని చూసి ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటెయ్యండి.. అటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జుక్కల్‌ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు.

CM KCR: ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం.. ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటెయ్యండి: సీఎం కేసీఆర్
CM KCR
Shaik Madar Saheb
|

Updated on: Oct 30, 2023 | 3:18 PM

Share

Telangana Elections: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు.. ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఎలా ఉందో చూడండి.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం.. అంటూ బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ఏవేవో చెబుతారు.. వాటిని చూసి ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటెయ్యండి.. అటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జుక్కల్‌ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. కర్నాటక, మహారాష్ట్రలో రైతుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి.. కర్నాటకలో రోజుకి 8-10 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. కర్నాటకలో 5 గంటల కరెంట్‌ మాత్రమే వస్తుంది.. కరెంట్‌ తిప్పలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందంటూ కేసీఆర్ పేర్కొన్నారు. 24 గంటల కరెంట్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని.. తెలంగాణకు డీకే వచ్చి కర్నాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నాం అంటున్నారంటూ వివరించారు. కాంగ్రెస్‌ నేతలు రైతు బంధు దుబారా అంటున్నారు.. రైతు బంధు పదాన్ని పుట్టించిందే బీఆర్‌ఎస్‌ అంటూ కేసీఆర్ పేర్కొన్నారు.

రెండు దఫాలుగా రుణమాఫీ చేసుకున్నాం.. కాంగ్రెస్‌ ఉచిత హామీలు ఇస్తుందే తప్ప, అమలు చేయదు.. అంటూ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ రాజ్యంలో ఎమ్మెల్యేలు కరెంట్‌, నీళ్ల బాధలు పట్టించుకున్నారా..? తలసరి ఆదాయం ఎంత..? విద్యుత్ వినియోగం ఎంత? తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌.. తక్కువ వయసున్న రాష్ట్రం తెలంగాణ.. కర్ణాటక ఎప్పటినుంచో ఉంది.. అయినా అక్కడి పరిస్థితులను గమనించాలంటూ పేర్కొన్నారు.

తెలంగాణకి ముందు తలసరి విద్యుత్‌ 1100ల యూనిట్లు..తెలంగాణ వచ్చాక తలసరి విద్యుత్‌ 2200ల యూనిట్లు.. ఎక్కడ లేని కరెంట్‌ ఇక్కడ మాత్రమే ఉంది.. పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే కరెంట్ కాటగలుస్తది.. కాంగ్రెస్‌ గెలిస్తే దళారుల రాజ్యమే వస్తుందంటూ కేసీఆర్ పేర్కొన్నారు.

ఓటు వేసే మందు ఆలోచించి ఓటు వేయ్యాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏవేవో హామీలను పట్టించుకోవద్దని.. అవన్నీ అమలుకావంటూ కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో రైతు బంధు దుబారా అంటున్న వారికి బుద్ది చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ ఫిర్యాదుతో రైతు బంధు ఆగింది..  ఎన్నికలు అయ్యాక అకౌంట్ల లో వేస్తామన్నారు. లెండి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని.. ఈ ప్రాంతంలోని పంటలన్నింటికి సాగునీరు అందిస్తామని కేసీఆర్ హామీనిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కమెడియన్ పొట్టి వీరయ్య కూతురు ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
కమెడియన్ పొట్టి వీరయ్య కూతురు ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
బుడిబుడి అడుగులతో భరతనాట్యం.. ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఫిదానే
బుడిబుడి అడుగులతో భరతనాట్యం.. ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఫిదానే
ఆమె వస్తే సెట్‏లో వస్తుంటే అందరి భయపడ్డారు.. ఖుష్బూ..
ఆమె వస్తే సెట్‏లో వస్తుంటే అందరి భయపడ్డారు.. ఖుష్బూ..
షుగర్ బాధితులకు గుడ్ న్యూస్! భోజనానికి ముందు ఒక ఉసిరికాయ తింటే..
షుగర్ బాధితులకు గుడ్ న్యూస్! భోజనానికి ముందు ఒక ఉసిరికాయ తింటే..
SIRపై భిన్నస్వరాలు.. వ్యతిరేకించే పార్టీలు.. స్వాగతించే గళాలు
SIRపై భిన్నస్వరాలు.. వ్యతిరేకించే పార్టీలు.. స్వాగతించే గళాలు
అమృతం అని అల్ల నేరేడు పండ్లు తెగ తింటున్నారా..?
అమృతం అని అల్ల నేరేడు పండ్లు తెగ తింటున్నారా..?
వైభవ్ కోసం 160 కిమీలు జర్నీ చేసి వచ్చిన 80 ఏళ్ల దిగ్గజ క్రికెటర్
వైభవ్ కోసం 160 కిమీలు జర్నీ చేసి వచ్చిన 80 ఏళ్ల దిగ్గజ క్రికెటర్
భారతీయ మహిళల జీవితాల్లో పెను మార్పులు..?
భారతీయ మహిళల జీవితాల్లో పెను మార్పులు..?
జీన్స్ ప్యాంట్ లూజ్ అయిందా? టైలర్‌తో పనిలేకుండానే టైట్ చేసుకోండి!
జీన్స్ ప్యాంట్ లూజ్ అయిందా? టైలర్‌తో పనిలేకుండానే టైట్ చేసుకోండి!
ఆఫీస్ టెన్షన్‌ నుంచి రిలీఫ్ కావాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే
ఆఫీస్ టెన్షన్‌ నుంచి రిలీఫ్ కావాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే