Telangana Schools: పాఠశాలల పునః ప్రారంభం..! ప్రత్యక్ష తరగతులపై విద్యాశాఖ ప్రతిపాదనలు..!

|

Jun 22, 2021 | 5:38 AM

కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టుతుండటం... లాక్‌డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తివేయడంతో తెలంగాణ విద్యాశాఖ పాఠశాలల పునః ప్రారంభంపై ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా..

Telangana Schools: పాఠశాలల పునః ప్రారంభం..! ప్రత్యక్ష తరగతులపై విద్యాశాఖ ప్రతిపాదనలు..!
Telangana Schools
Follow us on

కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం… లాక్‌డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తివేయడంతో తెలంగాణ విద్యాశాఖ పాఠశాలల పునః ప్రారంభంపై ఆలోచన మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రత్యక్ష తరగతుల పై పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర మంత్రులకు కొన్ని ప్రతిపాదనలను తీసుకొచ్చింది. అయితే జులై ఒకటి నుండి 8 ,9,10 తరగతులు ప్రారంభం చేసేందుకు ఏర్పాట్లు చేయడంతోపాటు మరిన్ని కొన్ని ప్రతిపాదనలను వారి ముందు ఉంచింది. ఈ ఏర్పాట్లపై మంత్రుల సమావేశంకు ప్రతిపాదనలు పంపించింది.. ఉదయం 9.30 నుంచి 3.30 గంటల వరకు క్లాసెస్ ప్రారంభించడం…. జులై 20 నుంచి 6 ,7 తరగతులు ప్రారంభం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత అంటే..ఆగస్ట్ 16 నుంచి  3,4,5 తరగతులు ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వం కి ప్రతిపాదనలు పంపింది.

ఇదిలావుంటే… జులై 1 నుంచి కాలేజీ విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులుంటాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి  స్పష్టం చేశారు. ఇంటర్, ఆపై అన్ని తరగతులకు ప్రత్యక్ష బోధన ఉంటుందని వెల్లడించారు. తరగతుల విషయమై బుధవారం రోజు విధివిధానాలు వెల్లడిస్తామని ప్రకటించారు.

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చే వారం విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇంజినీరింగ్‌, డిప్లమో ఫైనలియర్‌ పరీక్షలు జులైలో పూర్తి చేస్తామన్నారు. జులై 31లోపు డిగ్రీ, పీజీ ఫైనలియర్‌ పరీక్షలు కూడా పూర్తి అవుతాయన్నారు. టీచర్లు ఈ నెల 25 నుంచి విధులకు హాజరుకావాలని మంత్రి ఆదేశించారు. 18 ఏళ్లు పైబడిన విద్యార్థులకు వ్యాక్సినేషన్‌పై ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి : Minister Anil Kumar: ఏపీ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ అభ్యంతరాలు సరికాదు.. కేటాయింపులకు లోబడే నిర్మాణాలు

Bonalu: ఈ ఏడాది ఘనంగా బోనాల జాతర.. జులై 11న గోల్కొండ, 25న లష్కర్ బోనాలు