
‘నా కూతురి కామెంట్లు పూర్తిగా ఆమె వ్యక్తిగతం. ఒకరి అభిప్రాయాలకు మరొకరు బాధ్యత వహించాలంటే, అది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధం కాదా? అయినా, పార్టీ నాయకత్వంపై నాకు పూర్తి గౌరవం ఉంది, దయచేసి నోటీసును ఉపసంహరించుకోండి.. ఇట్లు మీ విధేయురాలు!’ కూతురు సుష్మిత చేసిన కామెంట్లపై మంత్రి కొండా సురేఖ క్రమశిక్షణా కమిటీకి రాసిచ్చిన సంజాయిషీ సారాంశం ఇది. సుతిమెత్తగా వెన్న రాసినట్టే ఉంది తప్ప, ఒక ఫైర్‌బ్రాండ్ లీడర్ నుంచి వచ్చిన రియాక్షన్‌లా లేదు. ఎందుకంటే, ‘అయితే ఏంటి’ అనే స్టయిల్‌లో తిరగబడే వాయిస్ కొండా సురేఖది. ఒక్క ఓరుగల్లు జిల్లాలోనే కాదు, స్టేట్‌వైడ్ ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న కొండా ఫ్యామిలీ.. డిసిప్లినరీ కమిటీ ఎదుట చాలాసార్లు నిలబడాల్సి వచ్చింది. కానీ, ఇలా స్లో అండ్ స్టడీ నేచర్‌ని ఎప్పుడూ చూసింది లేదు. అందుకే, సుష్మిత ఎపిసోడ్‌లో కొండా నుంచి వచ్చిన రియాక్షన్‌పై పార్టీ లోపలా బైటా పెద్ద చర్చే జరుగుతోంది. మీరు మారిపోయారు సార్.. అని అదేదో సినిమాలో డైలాగుని గుర్తు చేసుకుంటున్నారు లీడర్లు. కొండా సురేఖ నిజంగానే మారిపోయారా లేక మారిపోవాల్సి వచ్చిందా? నాటోన్లీ కొండా కుటుంబం, తెలంగాణ కాంగ్రెస్ మొత్తమ్మీద ఏదో మార్పయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకు? రెబల్స్ విషయంలో గాంధీభవన్‌లో ఏదైనా కొత్త ఫార్ములా వర్కవుట్ చేస్తోందా? ...