BJP: బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభం.. దుబ్బాక ఎమ్మెల్యే గైర్హాజరు.. ఎందుకంటే..

|

Mar 04, 2022 | 12:29 PM

BJP: బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే..

BJP: బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభం.. దుబ్బాక ఎమ్మెల్యే గైర్హాజరు.. ఎందుకంటే..
Follow us on

BJP: బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు (MLA Raghunandan Rao) హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారిక కార్యక్రమాల కారణంగానే రాలేదని చెబుతున్నా.. కారణాలు వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సభలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజాసింగ్ (Raja Singh) ఫ్లోర్‌ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఫ్లోర్‌ లీడర్‌ను మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అందుకే రఘునందన్‌ శాసనసభా పక్ష సమావేశానికి రాలేదన్న టాక్‌ వినిపిస్తోంది.

అయితే తెలంగాణలో మార్చి7వ తేదీ నుంచి జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పలువురు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. కాగా, ఎమ్మెల్యేల సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. మరో వైపు మల్లన్న సాగర్ నీటి విడుదల సంబంధించిన అధికారిక కార్యక్రమం ఉండటంతో హాజరుకాలేదని రఘునందన్ రావు తెలిపినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

Polavaram Project: ఏపీలో సీఎం జగన్‌తో కలిసి కేంద్ర మంత్రి షెకావత్‌ పర్యటన.. పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన

Fishes: నీటిలో ఉండే చేపలు ఎప్పుడు నిద్రపోతాయి..? ఈత కొట్టడం ద్వారా అలసిపోతాయా..?