Telangana Assembly: శుక్రవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ..

|

Sep 23, 2021 | 9:16 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి మొదలయ్యే సెషన్‌కి సన్నాహ సమావేశాన్ని నిర్వహించారు అసెంబ్లీ స్పీకర్‌ పోచారం. ఆవరణలో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.

Telangana Assembly: శుక్రవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ..
Telangana Assembly
Follow us on

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి మొదలయ్యే సెషన్‌కి సన్నాహ సమావేశాన్ని నిర్వహించారు అసెంబ్లీ స్పీకర్‌ పోచారం. ఆవరణలో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అటు.. అసెంబ్లీ పరిసరాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. నిషేధాజ్ఞనలు కూడా అమలులోకి వచ్చాయి.

శుక్రవారం నుంచే ఈ సభా సమరం మొదలవుతోంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమావేశాల ప్రారంభానికి ముందుగా సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి. అసెంబ్లీ కమిటీ మాల్‌లో జరిగిన ఈ సమావేశానికి మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డిలు హాజరయ్యారు.

అసెంబ్లీ ప్రాంగణంలో తీసుకోవాల్సిన భద్రత చర్యలతో పాటు..CM KCR, మంత్రులు, సభ్యులు వెళ్లేందుకు వేర్వేరు ప్రవేశ ద్వారాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. మరో వైపు ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టే బిల్లుల వాటిపై చర్చ జరిగింది. సభ్యులు అడిగే ప్రశ్నలపై ప్రభుత్వ పక్షాన మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చకు పట్టుబడుతామన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రధాన సమస్యలపై సంస్థాగత చర్చలు జరుగాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తే సమస్యలపై స్పీకర్‌ మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు.

అటు.. అసెంబ్లీ, మండలి సమావేశాల నేపథ్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో CS సోమేష్‌ కుమార్‌ BRK భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. సమావేశాల సందర్భంగా చర్చకు వచ్చే వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని.. ఆయా శాఖల ఉన్నతాధికారులు సరైన సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు.
సభలో చర్చకు వచ్చే అంశాలపై సంబంధిత శాఖల మంత్రులకు ఇచ్చే ఫైల్‌ను రెడీ చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

అటు అసెంబ్లీ పరిసరాల్లోని 4 కి.మీ. పరిదిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిషేధించినట్టు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. వివిధ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జరిగే చర్చలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఈ నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం 6గంటల నుంచి ఈ నిషేదాజ్ఞలు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ముగిసే వరకూ వర్తిస్తాయని ఆయన తెలిపారు.

కాగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ‘దళితబంధు’కు(Dalita bandu) చట్టబద్ద‌త కల్పించే బిల్లుతో పాటు మరో ఏడు బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.వీటితో పాటు మరి కొన్ని ఆర్డినెన్స్‌లకు చట్టబద్దత కల్పించే బిల్లులు కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది. వరి ధాన్యం కొనుగోలు, నదీ జలాల వివాదం, దళితబంధు పథకం, ఉద్యోగాల భర్తీ, సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన వంటి అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి: Bats with Covid: అక్కడి గబ్బిలాల్లో మరో కొత్త వైరస్.. ఈజీగా వ్యాపిస్తుందంటున్న పరిశోధకులు..

Stock market update: బుల్‌ రంకెలేసింది.. రికార్డుల మోత మోగించింది.. ఇన్వెస్టర్లలో లాభాల పంట..

రోడ్డు పై స్విమ్మింగ్ పూల్.. బురద నీటిలో శవాసనం.. అతనెవరో తెలిస్తే షాక్ అవుతారు..