Gurrampode Tribal Lands: గుర్రంపోడు భూములపై బీజేపీ , టీఆర్ఎస్ ల మధ్య వార్..ఇక్కడనుంచే యుద్ధం మొదలంటున్న బీజేపీ..

| Edited By: Ravi Kiran

Feb 15, 2021 | 7:11 PM

కోట్లాది మంది, గిరిజనులు బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో తెలంగాణ బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...

Gurrampode Tribal Lands: గుర్రంపోడు భూములపై బీజేపీ , టీఆర్ఎస్ ల మధ్య వార్..ఇక్కడనుంచే యుద్ధం మొదలంటున్న బీజేపీ..
Follow us on

Gurrampode Tribal Lands: కోట్లాది మంది, గిరిజనులు బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో తెలంగాణ బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచార జాతులకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలుగు గడ్డ మీద జన్మించడం గర్వకారణమని అన్నారు. అంతేకాదు సేవాలాల్ సంచారజాతులను ఏకతాటి మీదకు తెచ్చిన ఘనుడని..మతమార్పిడి విషయంపై ఎంత వత్తిడి వచ్చినా తన మతం మార్చుకోలేదు.. సంస్కృతిని పరిరక్షించారని సంజయ్ చెప్పారు. అయితే ఇప్పుడు తెలంగాణాలో ఉన్న ప్రభుత్వం సేవలాల్ స్ఫూర్తికి విరుద్ధంగా పాలిస్తున్నారంటూ విమర్శించారు. అంతేకాదు టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల భూములను లాక్కొని దౌర్జన్యం చేస్తుందని ఆరోపించారు. 10 శాతం గిరిజనుల రిజర్వేషన్లు అమలు చేయడం లేదని సీఎం కేసీఆర్ కు

గిరిజనుల రిజర్వేషన్ల పట్ల చిత్త శుద్ధి లేదన్నారు. గుర్రంపోడులో గిరిజనులకు కేటాయించిన భూములను కేసీఆర్ సర్కార్ అన్యాయంగా లాక్కుంటుందని.. పేద ప్రజలకు పట్టాలు ఇవ్వవలసింది పోయి బడా బాబులకు కొమ్ముకాస్తుందంటూ సంచలన కామెంట్స్ చేశారు సంజయ్. అంతేకాదు.. పేద గిరిజనులకు అండగా బీజేపీ ఉంటుందని.. గుర్రంపోడు నుంచి యుద్ధం మొదలు పెట్టిందని చెప్పారు. పొడు భూముల విషయంలో కేసీఆర్ విధివిధానాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ ను ఓడించి ప్రజలు బుద్ధి చెప్పాలని సంజయ్ పిలుపునిచ్చారు.

Also Read:

నాగోబా ఆలయాన్ని దర్శించుకున్న గవర్నర్ బండారు దత్తాత్రేయ.. ఘనస్వాగత పలికిన మెస్రం వంశీయులు..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. మార్చి 14న ఎన్నికలు