T Hub 2.0 Hyderabad: అంతర్జాతీయ ప్రమాణాలతో టీ హబ్‌ 2.0.. నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..

|

Jun 28, 2022 | 7:35 AM

T Hub 2.0 Hyderabad: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ అయిన టీ హబ్‌ 2.0 ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ రెండో టీ హబ్‌ను..

T Hub 2.0 Hyderabad: అంతర్జాతీయ ప్రమాణాలతో టీ హబ్‌ 2.0.. నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..
T Hub
Follow us on

T Hub 2.0 Hyderabad: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ అయిన టీ హబ్‌ 2.0 ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ రెండో టీ హబ్‌ను సీఎం కేసీఆర్‌ ఇవాళ ప్రారంభించనున్నారు. కాగా, ఐటీ కారిడార్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన టీ హబ్‌ 2.0కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. స్టార్టప్స్‌, ఆంత్రప్రెన్యూర్స్‌, ఇన్నోవేటర్స్‌, వెంచర్‌ క్యాపటిలిస్ట్స్‌, మెంటార్స్‌ కార్యకలాపాలకు వేదిక అయ్యేలా ఈ రెండో టీ హబ్‌ను నిర్మించారు. అత్యున్నత ప్రమాణాలతో 276 కోట్ల రూపాయలతో నిర్మించిన టీ హబ్‌ 2ని దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్. రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో 5. 82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టి హబ్‌ 2ని నిర్మించారు. రెండు వేల స్టార్టప్‌లు పనిచేసుకునేలా ఫెసిలిటీస్‌ కల్పించారు.

మొదటి టీ హబ్‌ను 2015లో ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో ప్రారంభించారు. అయితే ఇంకా పెద్ద టీ హబ్‌ అవసరమని ప్రభుత్వం గుర్తించింది. దాంతో ప్రతిష్టాత్మకమైన టీ హబ్‌ 2.0కు ప్లాన్‌ చేసింది. మొదటి టీ హబ్‌ కంటే రెండోది ఐదు రెట్లు పెద్దది. కొరియా కంపెనీ స్పేసెస్‌ టీ హబ్‌ 2.0 డిజైన్‌ను చేసింది. స్పేస్‌ షిప్‌ స్ఫూర్తితో డిజైన్‌ చేసిన ఈ బిల్డింగ్‌ను 10 అంతస్తులతో నిర్మించారు. టీ హబ్‌ 2.0 ఇనాగరేషన్‌ సందర్భంగా జరిగే మాస్టర్‌ క్లాసెస్‌, సెషన్స్‌లో 25 యునికార్న్‌ స్టార్టప్‌ ఫౌండర్లు, 30 వెంచర్‌ క్యాపిటల్‌ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ టి హబ్‌ 2ని ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. దేశంలో ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడమే టీ హబ్‌ లక్ష్యమన్నారు కేటీఆర్‌. స్టార్టప్‌ విప్లవానికి మొదటి టీ హబ్‌ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. బిజినెస్‌, ఇండస్ట్రీ రంగాలతో యువత కనెక్ట్‌ అయ్యేందుకు టీ హబ్‌ ఎకో సిస్టమ్‌ను క్రియేట్‌ చేస్తోదన్నారు కేటీఆర్‌.