AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singareni Election: సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా.. డిసెంబర్ 27న గుర్తింపు ఎన్నికలు

తెలంగాణలో మరో ఎన్నికల సైరన్‌ మోగింది. సింగరేణిలో ఈనెల 27న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు రోజులు కాకముందే సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు డేట్‌ ఫిక్స్‌ అయ్యింది.

Singareni Election: సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా.. డిసెంబర్ 27న గుర్తింపు ఎన్నికలు
Singareni Elections
Balaraju Goud
|

Updated on: Dec 04, 2023 | 9:19 PM

Share

తెలంగాణలో మరో ఎన్నికల సైరన్‌ మోగింది. సింగరేణిలో ఈనెల 27న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు రోజులు కాకముందే సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు సంబంధించి గతంలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. అయితే అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. దాంతో సింగరేణి ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌లో డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు సమక్షంలో జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డితోపాటు జాతీయ సంఘాల నాయకులు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌, ఐఎఫ్‌టీయూ, ఇతర సంఘాల నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏకాభిప్రాయానికి రావడంతో ఈనెల 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. దాంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికుల ఓటరు లిస్టును ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు.

అయితే 2017 సెప్టెంబర్‌‌ 5న జరిగిన సింగరేణి ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మొత్తం 11 ఏరియాల్లో తొమ్మిది ఏరియాలు గెలుచుకుని గుర్తింపు సంఘమైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల పరిధి కార్మిక క్షేత్రాల్లోని 12 నియోజకవర్గాలతోపాటు ఇతర ప్రభావిత నియోజకవర్గాల్లో సింగరేణి ఎన్నికల ప్రభావం ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
సజ్జ పిండి, మజ్జిగతో చేసే ఈ వంటకం సమ్మర్లో బెస్ట్ డ్రింక్
సజ్జ పిండి, మజ్జిగతో చేసే ఈ వంటకం సమ్మర్లో బెస్ట్ డ్రింక్
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఒక్కసారి ఇది చూడండి.
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఒక్కసారి ఇది చూడండి.
ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్‌చేస్త
ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్‌చేస్త
సచిన్‌తో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. అప్పటిలో
సచిన్‌తో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. అప్పటిలో
కోడిపుంజు వింత అరుపులు.. ఏం జరిగిందా అని చూడగా.. షాకింగ్‌ సీన్‌
కోడిపుంజు వింత అరుపులు.. ఏం జరిగిందా అని చూడగా.. షాకింగ్‌ సీన్‌
బొప్పాయి వర్సెస్ పైనాపిల్‌! కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న వారికి ఏది
బొప్పాయి వర్సెస్ పైనాపిల్‌! కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న వారికి ఏది
ఇదేందయ్యా ఇదీ.. వధువు ఒక్కరే.. వరులు మాత్రం ఇద్దరా !!
ఇదేందయ్యా ఇదీ.. వధువు ఒక్కరే.. వరులు మాత్రం ఇద్దరా !!
లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం..
లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం..
ఇట్స్ కన్ఫర్మ్‌! వాయిదాపడిన పెద్ది | డ్యూటీ ఎక్కారు
ఇట్స్ కన్ఫర్మ్‌! వాయిదాపడిన పెద్ది | డ్యూటీ ఎక్కారు