చెప్పిన చోట బండి ఆపలేదని డ్రైవర్‌‌ను చితకబాదారు.. బూటుకాలితో తన్నారు.. స్పందించిన ఎస్పీ..

|

Mar 23, 2021 | 10:23 PM

ఇదిగో మిమ్మల్నే ... పోలీసులు ఆపిన చోటే బండి ఆపేయండి... లేకుంటే మీకు బడిత పూజ తప్పదు. ఎందుకని అడిగితే బూటుకాలితో తంతారు. సంగారెడ్డి జిల్లాలో బొలేరో వాహన డ్రైవర్‌పై పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన...

చెప్పిన చోట బండి ఆపలేదని డ్రైవర్‌‌ను చితకబాదారు.. బూటుకాలితో తన్నారు.. స్పందించిన ఎస్పీ..
Police Beats Van Driver
Follow us on

ఇదిగో మిమ్మల్నే … పోలీసులు ఆపిన చోటే బండి ఆపేయండి… లేకుంటే మీకు బడిత పూజ తప్పదు. ఎందుకని అడిగితే బూటుకాలితో తంతారు. సంగారెడ్డి జిల్లాలో బొలేరో వాహన డ్రైవర్‌పై పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన దుర్ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. చెప్పి చోట వెహికల్‌ను ఆపలేదని చితికబాదారు. బూటు కాలితో తంతూ లాఠీలతో కొట్టారు.. లబోదిబోమని మొత్తుకుంటున్నా వినకుండా కొట్టారు. సదాశివపేట పోలీసులు రెచ్చిపోయిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

సదాశివపేటకు చెందిన వాజిద్ బొలేరో వాహనం నడుపుతుంటాడు. సింగూరుకు కిరాయికి వెళ్తుండగా… అయ్యప్ప స్వామి గుడి వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ప్రధాన రహదారిపై పోలీసులు ఆ బండిన ఆపారు. సడెన్‌గా ఆపలేకపోయిన డ్రైవర్‌ కాస్త ముందుకెళ్లి ఆపాడు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన కానిస్టేబుల్ అతని చేతిలో ఉన్న లాఠీతో చితకబాదాడు. కానిస్టేబుల్ అక్కడితో ఆగకుండా బూటు కాలితో తంతూ బండ బూతులు తిట్టాడు. లాఠీ దెబ్బలకు అతనికి గాయాలయ్యాయి. ఓవైపు రాష్ట్రంలో ప్రైండ్లీ పోలీస్ అని పోలీసు ఉన్నతాధికారులు చెబుతుంటే… కింది స్థాయిలో అమలు కాకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. సదాశివపేటలో డ్రైవర్ జావిద్‌పై పోలీసులు దాడి చేయడం సరైనది కాదని పేర్కొన్నారు.  ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని సహించేది లేదని… ఇప్పటికే కానిస్టేబుల్ రాములు, హోమ్ గార్డ్ బాలరాజును సస్పెండ్ చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న ఏఎస్ఐ దుర్గయ్య, కానిస్టేబుల్ ప్రసాద్‌లను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేసినట్లు వెల్లడించారు.

Also Read: Viral Video: చిటారు కొమ్మన ఉన్న కోతిపై పులి అటాక్.. ఎండింగ్ మాత్రం అస్సలు ఊహించలేరు..

తెలంగాణలో రేపట్నుంచి విద్యాసంస్థలు బంద్… ప్రభుత్వం కీలక ప్రకటన