Telangana: రూ.3500 కోట్లను మామ కొట్టేశాడు.. కట్ చేస్తే..కలలో కూడా ఊహించని ట్విస్ట్

| Edited By: Velpula Bharath Rao

Nov 20, 2024 | 10:34 AM

రూ.3500 కోట్ల రూపాయలను మామ కొట్టేస్తే..దోచుకున్న డబ్బుకే ఓ వాచ్మెన్ మళ్ళీ కన్నం వేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. హైదరాబాదులో ఇటీవల చోటు చేసుకున్న అతిపెద్ద భారీ స్కామ్‌ సాహితీ ఇన్ఫ్రా కేసు... అసలు స్టోరీ ఏంటంటే?

Telangana: రూ.3500 కోట్లను మామ కొట్టేశాడు.. కట్ చేస్తే..కలలో కూడా ఊహించని ట్విస్ట్
Steals Gold Ornaments
Follow us on

రూ.3500 కోట్ల రూపాయలను మామ కొట్టేస్తే..దోచుకున్న డబ్బుకే ఓ వాచ్మెన్ మళ్ళీ కన్నం వేసి కొట్టేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాదులో ఇటీవల చోటు చేసుకున్న అతిపెద్ద భారీ స్కామ్‌ సాహితీ ఇన్ఫ్రా కేసు.. ఈ స్కామ్‌తో వందల కోట్ల కొద్ది రూపాయలు డిపాజిటర్ల నుండి సేకరించి భారీ మొత్తంలో కుంభకోణానికి పాల్పడ్డాడు సాహితీ ఇన్ఫ్రా చైర్మన్ లక్ష్మీనారాయణ.. ఇప్పటికే ఈ స్కామ్‌లో గతంలో పోలీసులు అరెస్టు చేయగా తాజాగా ఈడీ అధికారులు సాహితీ చైర్మన్‌ను అరెస్టు చేశారు. అయితే తాజాగా ఆయన కోడలు అఖిల రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ చోరీపై ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వందల కోట్ల రూపాయల స్కామ్‌లో కీలక సూత్రధారి సాహితీ చైర్మన్ లక్ష్మీనారాయణ.. ఆయన కోడలు అఖిలారెడ్డి జూబ్లీహిల్స్లో నివాసం ఉంటుంది. కొద్ది నెలల క్రితం ఆమె బెంగుళూరుకు వెళ్లాల్సి ఉన్న తరుణంలో తన వాచ్మెన్ సురేష్‌ను పిలిచి ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది. నెలలు గడుస్తున్న అఖిలారెడ్డి హైదరాబాద్‌కు తిరిగి రాకపోవడంతో ఇంట్లో ఉన్న సొత్తును కాజేసేందుకు సురేష్ అండ్ కో ప్లాన్ చేశారు. తనకు తెలిసిన స్నేహితులను పిలిపించి ఇంటి మొత్తానికి కన్నం వేశారు. లక్షల కొద్ది రూపాయలు విలువ చేసే బంగారంతో పాటు ఆభరణాలను చోరీ చేశారు. చోరీ చేసిన సొత్తు మొత్తాన్ని దుకాణంలో పెట్టి డబ్బులు దండుకున్నారు.

అయితే తాజాగా బెంగళూరు నుండి హైదరాబాద్‌కు వచ్చిన అఖిలారెడ్డికి విషయం తెలిసి అవాక్కయింది.ఇంటిని చూసుకోమన్న వాచ్ మెన్ మొత్తం సొత్తును కాజేసి వ్యాపారి దగ్గర పెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు చోరీకి పాల్పడ్డ నిందితులతోపాటు ఈ సొత్తు కొనుగోలు చేసిన వ్యాపారిని సైతం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి భారీగా ఆభరణాలు రికవరీ చేసారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి