Telangana: ఈ నెల 27 నుంచి రాణి ఇందిరాదేవి విద్యాలయాల్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు.. హాజరు కానున్న ప్రముఖులు

| Edited By: Velpula Bharath Rao

Nov 25, 2024 | 7:37 PM

పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణం వేదిక కానుంది. 90ఏళ్లకు పైగా అనుబంధం కలిగిన విద్యార్థులంతా ఒక్కచోట కలుసుకోబోతున్నారు. ఇంతటి మహా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు పూర్వవిద్యార్థుల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు రెండు వేల మంది విద్యార్థులు హాజరుకానున్న ఈ మహోత్తర కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు రాణి ఇందిరా దేవి విద్యాలయాల అల్యూమిని నిర్వహిస్తుంది. 

Telangana: ఈ నెల 27 నుంచి రాణి ఇందిరాదేవి విద్యాలయాల్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు.. హాజరు కానున్న ప్రముఖులు
Maha Rani Indira Devi Balika Vidyalaya
Follow us on

కొల్లాపూర్ పట్టణంలోని రాణి ఇందిరా దేవి ప్రభుత్వ పాఠశాల, బాయ్స్ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. 1930లో స్థాపించిన రాణి ఇందిరా దేవి పాఠశాల, 1979లో ఏర్పాటు చేసిన రాణి ఇందిరా దేవి బాయ్స్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం వైభవంగా నిర్వహించాలని అల్యూమినీ భావిస్తోంది. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టారు. దాదాపు 2000వేల మంది పూర్వ విద్యార్థులు హాజరుకానున్నట్లు అంచనా వేస్తున్నారు. మైహోం గ్రూప్స్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, మంత్రి జూపల్లి కృష్ణారావు పాటు విద్యార్థులు హాజరుకాబోతున్నారు.

గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 27 నుంచి 29వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. మొదటి రోజు మైహోం గ్రూప్స్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, BITS వీసీ, మాజీ ఐఐటీ డైరెక్టర్ రాంగోపాల్ రావులు వేడుకలను ప్రారంభిస్తారు. గోల్డెన్ జూబ్లీ పాటల సీడీని ముఖ్య అతిథులు విడుదల చేసిన తర్వాత  ఉపన్యాసాలను ఇస్తారు. ఇక మధ్యాహ్నం వివిధ యూనివర్సిటీల వీసీలతో ప్యానెల్ డిస్కషన్స్‌ను నిర్వహించనున్నారు. అనంతరం రాణీ ఇందిరా దేవి పేరిట అవార్డ్స్ కార్యక్రమం ఉంటుంది. తర్వాత బ్యాచ్‌ల వారీగా పరిచయ కార్యక్రమం, టీచర్లు, లెక్చరర్లకు సన్మానం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా వివిధ ఫన్ యాక్టివిటీస్‌తో పాటు ప్రజా వాగ్గేయకారులు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్నలతో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇక చివరగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో మొదటి రోజు వేడుకలు ముగిస్తారు. ఇక వేడుకల్లో రెండో రోజు రాణీ ఇందిరా దేవి పాఠశాలకు ఎంతో ప్రత్యేకంగా నిలిచే ప్రభాతభేరీ కార్యక్రమానికి సినీనటుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆ తర్వాత ముఖ్య అతిథులతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక అల్యూమినీ విజన్ 2050 ఏవీని లాంచ్ చేస్తారు. అనంతరం వివిధ యూనివర్సీటీ వీసీలతో ప్యానెల్ డిస్కషన్స్ ఏర్పాటు చేస్తారు. ఇక మధ్యాహ్నం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా పైలాన్, సావనీర్, పూర్వవిద్యార్థులకు సన్మానం, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందజేత కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం మహిళల అంశం ఫోకస్ తో మహిళా యూనివర్సిటీ వీసీతో ప్రత్యేక ప్యానెల్ డిస్కషన్ ఏర్పాటు చేశారు. తర్వాత ప్రజా వాగ్గేయకారులు అందేశ్రీ, జయరాజ్‌లతో ప్రోగ్రామ్‌ను కండక్ట్ చేస్తున్నారు. ఇక సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో రెండవ రోజును ముగించనున్నారు.

ముగింపు రోజు ఉదయం డిప్యూటీ సీఎం… సాయంత్రం మ్యూజికల్ నైట్:

చివరిరోజైన మూడోరోజు కార్యక్రమాలు జోష్ నింపేలా ఉన్నాయి. ముగింపు వేడుకలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఉదయం పూర్వవిద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులతో కలిసి 2కే వెల్ నెస్ రన్‌ను నిర్వహించనున్నారు. తర్వాత బ్యాచ్‌ల వారీగా పరిచయం చేసుకొని అల్యూమినీతో వివిధ ఇండస్ట్రీస్ తో ఎంవోయూల సంతకాలు ఉండనున్నాయి. సక్సెస్ స్టోరీస్ థీమ్‌తో ప్యానల్ డిస్కషన్, ఆర్ఐడీ అవార్డ్స్ కార్యక్రమం ఉంటుంది. తర్వాత టీచర్లు, లెక్చరర్లను సన్మానించిన అనంతరం ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. ఇక ఈవెనింగ్ మెగా మ్యూజికల్ బ్యాండ్, ఆర్కెస్ట్రాను ఘనంగా నిర్వహించబోతున్నారు. సినీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఇండియన్ ఐడల్ టీం ఫెర్మార్మెన్స్ ను ఉండనున్నాయి. ఈ కార్యక్రమం కోసం రామాపూరం దారిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

నూతన శోభ సంతరించుకున్న RID పాఠశాల:

ఇక రాణీ ఇందిరా దేవీ విద్యామందిరాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల నేపథ్యంలో పూర్వ విద్యార్థి, మైహోం గ్రూప్స్ అధినేత రామేశ్వర్ రావు పాఠశాలకు నూతన రూపు తీసుకువచ్చారు. శిథిలావస్థలతో ఉన్న విద్య, బుద్దులు నేర్పిన పాఠశాల రూపురేఖలే మార్చేశారు. హెరిటేజ్ బిల్డింగ్‌కు ఎలాంటి నష్టం జరగకుండా అత్యంత సుందరంగా ఇప్పుడు రాణీ ఇందిరా దేవీ పాఠశాల దర్శనమిస్తోంది. డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి వసతులు ఇలా అన్ని రకాలుగా పాఠశాల కొత్తదనంతో వెలిగిపోతోంది. మూడు రోజుల పాటు జరిగే రాణీ ఇందిరా దేవీ విద్యా మందిరాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు అల్యూమినీ కనివినీ ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే విద్యార్థులకు భోజన, నివాస వసతిని సైతం కల్పిస్తోంది అల్యూమినీ. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మూడురోజుల పాటు మైహోం గ్రూప్స్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, మంత్రి జూపల్లి కఈష్ణరావులు హాజరుకానున్నారు.