President of India: ఒక సామాన్యునికి ఫోన్ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. కారణం ఏంటంటే..

|

Sep 13, 2021 | 8:02 AM

President of India: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త అనిల్ కుమార్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫోన్ చేశారు. పలు అంశాలపై..

President of India: ఒక సామాన్యునికి ఫోన్ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. కారణం ఏంటంటే..
President Ramnath Kovind
Follow us on

President of India: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త అనిల్ కుమార్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫోన్ చేశారు. పలు అంశాలపై కాసేపు మాట్లాడారు. త్వరలోనే ఆయనను కలేసేందుకు అవకాశం కూడా ఇస్తానని అన్నారు. అసలేం జరిగిందంటే.. జడ్చర్లలోని గాంధీ ట్రస్టులో అక్టోబర్ 2న ఏర్పాటు చేయనున్న గాంధీ విగ్రహావిష్కరణకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ను ఆహ్వానిస్తూ పోస్టు ద్వారా ఆహ్వాన పత్రాలను పంపించారు అనిల్ కుమార్. ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్‌కు రాష్ట్రపతి భవన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

స్వయంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ తన పేరు అడిగి పరిచయం చేసుకున్నారు. అయితే, జడ్చర్లలో గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాలేకపోతున్నానని, ఆరోజు బిజీ షెడ్యూలు ఉన్నట్లు అనిల్‌కు రాష్ట్రపతి సమాచారం అందించారు. అయితే, తమను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్రపతిని అనిల్ కోరగా.. త్వరలోనే దీనిపై సమాచారం అందిస్తానని రామ్‌నాథ్ కోవింద్ బదులిచ్చారు. కాగా, రాష్ట్రపతి స్వయంగా తనకు ఫోన్ చేసి రెండు నిమిషాల 5 సెకండ్ల పాటు మాట్లాడడం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని అనిల్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఒక సామాన్యునికి దేశ ప్రథమ పౌరుడు ఫోన్ చేయడం పట్ల పట్టణంలోని పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also read:

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి సరయు అవుట్.. చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన ఆ కంటెస్టెంట్

Hyderabad: మెదక్‌లో మంచి వైద్యుడిగా గుర్తింపు.. హైదరాబాద్‌కు వచ్చి ప్రాణాలు విడిచాడు.. కారణమేంటంటే..

Maa Elections 2021: ‘మా’ లో పేలుతోన్న మాటల తూటాలు.. రసవత్తరంగా మారిన ఫైట్