Telangana: మావోయిస్టు పార్టీకి మరో షాక్.. భారీగా డంపు స్వాధీనం..

| Edited By: Velpula Bharath Rao

Nov 08, 2024 | 9:56 PM

ములుగు జిల్లాలో మావోయిస్టు పార్టీకి చెందిన ఆయుధ సామాగ్రి డంపును పోలీసులు గుర్తించారు. ఆ డంపును స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఆయుధాలు, భారీ ఎత్తున తూటాలు స్వాధీనం చేసుకున్నారు.

Telangana: మావోయిస్టు పార్టీకి మరో షాక్.. భారీగా డంపు స్వాధీనం..
Police Seized The Dump Of Maoists In Mulugu District
Follow us on

మావోయిస్టు పార్టీకి మరో దెబ్బ తగిలింది. ములుగు జిల్లాలో మావోయిస్టు పార్టీకి చెందిన ఆయుధ సామాగ్రి డంపును పోలీసులు గుర్తించారు. ఆ డంపును స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఆయుధాలు, భారీ ఎత్తున తూటాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తున్న పోలీసులు మావోలు లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఒకవైపు వరుస ఎన్‌కౌంటర్లో కీలక నేతలను చనిపోతున్న సంగతి తెలిసిందే.

ములుగు జిల్లాలో పోలీసులు మావోయిస్టు పార్టీకి చెందిన భారీ డంపును గుర్తించారు. అందులో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.. ఈ డంపును తాడ్వాయి మండలం ఒడ్డుగూడెం అడవుల్లో వట్టెవాగు సమీపంలో గుర్తించారు. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం నేపథ్యంలో బీడీ టీం బృందాలు అక్కడికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీ డంపును గుర్తించి వెలికి తీశారు. ఆ పేలుడు పదార్థాలను జిల్లా ఎస్పీ శభరీష్ పరిశీలించారు.  ఆ డంపులో మూడు బెల్జియం మోడల్ తుపాకులతో పాటు 165 రౌండ్స్ బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికైనా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ శబరిష్ పిలుపునిచ్చారు.

వీడియో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి