జై భీం సినిమా తరహా ఘటన వెలుగులోకి.. న్యాయం కోసం బాధితుడి అవేదన..

| Edited By: Srikar T

Jul 08, 2024 | 9:07 AM

కరీంనగర్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహంతో ఓ యువకుడుని చితకబాదారు. ఒక దొంగతనం విషయంలో నిర్దారణ కోసం పోలీసులు వ్యవహరించిన తీరు జై భీం సినిమాను తలపించేలా ఉంది. కాయకష్టం చేసుకొని జీవించే ఓ ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిపై దొంగతనం ఒప్పుకోవాలంటూ ధర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇదే సంచలనంగా‌ మారింది. ప్రజాసంఘాల నేతలు బాధితుడికి అండగా‌ నిలిచారు.

జై భీం సినిమా తరహా ఘటన వెలుగులోకి.. న్యాయం కోసం బాధితుడి అవేదన..
Karimnagar
Follow us on

కరీంనగర్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహంతో ఓ యువకుడుని చితకబాదారు. ఒక దొంగతనం విషయంలో నిర్దారణ కోసం పోలీసులు వ్యవహరించిన తీరు జై భీం సినిమాను తలపించేలా ఉంది. కాయకష్టం చేసుకొని జీవించే ఓ ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిపై దొంగతనం ఒప్పుకోవాలంటూ ధర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇదే సంచలనంగా‌ మారింది. ప్రజాసంఘాల నేతలు బాధితుడికి అండగా‌ నిలిచారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన తాడి కనుకయ్య అనే వ్యక్తిని దొంగతనం కేసులో అప్రూవర్‎గా‌ మారాలంటూ పోలీసు‌స్టేషన్‎కి పిలిపించి చిత్రహింసలకి గురి చేశారు.

ఎరుకలి సామాజికవర్గానికి చెందిన తాముకూలీపనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తామని చెప్పాడు బాధితుడు. తమపై చేయని నేరానికి.. పోలీసు స్టేషనుకు పిలిపించి చిత్రహింసలకు గురి చేశారని బాధితుడు కనుకయ్య‌ అవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం కరీంనగర్‎లోని ఆసుపత్రి‎లో చికిత్స పొందుతున్న కనుకయ్యని ప్రజా సంఘాల నాయకులు కలిసి పరామర్శించారు. సమగ్ర విచారణ చేయాల్సిన పోలీసులు విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ రామడుగు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..