అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్‎కు అనుమతించని స్కూల్ యాజమాన్యం.. కట్‎చేస్తే సీన్ రివర్స్..

|

Apr 18, 2024 | 1:28 PM

హైదరాబాద్‎కు 250 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాషాయ వస్త్రాలు ధరించి విద్యాసంస్థకు హాజరైనందుకు విద్యార్థులను లోనికి అనుమతించలేదు పాఠశాల యాజమాన్యం. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. కన్నెపల్లి గ్రామంలోని హనుమాన్‌ దీక్షా దుస్తులు ధరించి కొందరు విద్యార్థులు విద్యా సంస్థకు వచ్చారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పాఠశాల కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌పై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.

అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్‎కు అనుమతించని స్కూల్ యాజమాన్యం.. కట్‎చేస్తే సీన్ రివర్స్..
Blessed Mother Teresa High School
Follow us on

హైదరాబాద్‎కు 250 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాషాయ వస్త్రాలు ధరించి విద్యాసంస్థకు హాజరైనందుకు విద్యార్థులను లోనికి అనుమతించలేదు పాఠశాల యాజమాన్యం. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. కన్నెపల్లి గ్రామంలోని హనుమాన్‌ దీక్షా దుస్తులు ధరించి కొందరు విద్యార్థులు విద్యా సంస్థకు వచ్చారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పాఠశాల కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌పై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 153 (ఎ) (మతం లేదా జాతి ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295 (ఎ) (మత భావాలను అవమానించడం) కింద కేసు నమోదు చేసినట్లు దండేపల్లి పోలీసులు తెలిపారు.

మంగళవారం పాఠశాల అధికారులపై బ్లెస్డ్ మదర్ థెరిసా హైస్కూల్ యాజమాన్యం బుధవారం మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం విద్యార్థులు యూనిఫారానికి బదులుగా కాషాయ దుస్తులు ధరించి స్కూల్‎కు వచ్చినట్లు తెలిపారు. దీనిని గమనించి వారి తల్లిదండ్రులను తీసుకురావాలని ప్రిన్సిపాల్ కోరారు. తరువాత, కొంతమంది వ్యక్తులు పాఠశాల యాజమాన్యం నుండి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరి కొంతమంది కోపంతో నిరసన తెలిపారు. విద్యార్థుల తరఫున వచ్చిన పలువురు ఆందోళనకారులు పాఠశాల కిటికీలను ధ్వంసం చేశారని పాఠశాల కరస్పాండెంట్ తెలిపారు. కరస్పాండెంట్ విద్యార్థులపై చూపిన వివక్షకు క్షమాపణలు చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..