Weather Report: ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే!

తెలుగురాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. శీతావకాలంలోనూ ఎండాకాలాన్ని తలపిస్తున్న ఉక్కపోత నుంచి ఉపశమనాన్ని కల్పిస్తూ.. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వర్షాలు కరిసే ఛాన్స్ ఉందని తెలిపింది. దేశంలోకి ఈశాణ్య రుతువనాల రాకకు వాతావరణం అనుకూలంగా ఉందని వీటి ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

Weather Report: ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే!
Ap, Telangana Latest Weaher Report

Updated on: Oct 13, 2026 | 7:57 AM

ఎండాకాలం పోయి 4 నెలలు గడుస్తున్నా.. తెలుగురాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గట్లేదు. శీతాకాలం స్టార్ట అయినా కూడా ఇంకా భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో తెలుగురాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ నెల 15 నుంచి 18లోపు తెలంగాణలోకి ఈశాణ్య రుతుపవనాలు ప్రవేశించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర ప్రకారం.. ఖమ్మం, ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచానా వేసింది. మిగతా జిల్లాల్లో చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉందని, మరి కొన్ని జిల్లాల్లో ఆహ్లాదకరమైన పొడి వాతావరణం ఉండొచ్చని తెలిపింది. ఈ వర్షాల రాక ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ వాసులకు ఊరకల్పించనుంది.

ఇక ఈశాణ్య రుతుపవణాల ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, ధక్షిణ కోస్తాంద్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మరికొన్ని జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని అంచానా వేసింది. అలాగే తీర ప్రాంతాల్లో వర్షాల సమయంలో గంటలకు 30-40 కిలీ మీటర్ల వేగంతో ఈదురుగాలుఉ కూడా వీయొచ్చని తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us