టీ తాగేందుకు వచ్చి హోటల్ యజమానికి టోకరా.. రూ. 96 వేలు హాంఫట్

టెక్నాలజీ పెరగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. టెక్కాలజీని ఉపయోగించి కేటుగాళ్లు ఎన్నో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా హోటల్‌లో టీ తాగేందుకు వచ్చిన వ్యక్తి.. ఏకంగా ఆ హోటల్‌ నిర్వాహకుడి ఫోన్‌ నుంచే 96వేల రూపాయలు కొట్టేశాడు. సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

టీ తాగేందుకు వచ్చి హోటల్ యజమానికి టోకరా.. రూ. 96 వేలు హాంఫట్
Online Fraud
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 16, 2024 | 8:43 PM

టెక్నాలజీ పెరగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. టెక్కాలజీని ఉపయోగించి కేటుగాళ్లు ఎన్నో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా హోటల్‌లో టీ తాగేందుకు వచ్చిన వ్యక్తి.. ఏకంగా ఆ హోటల్‌ నిర్వాహకుడి ఫోన్‌ నుంచే 96వేల రూపాయలు కొట్టేశాడు. సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

విషయం తెలుసుకున్న ఆ హోటల్ యజమానితోపాటు, గ్రామస్తులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే…అక్కన్నపేట మండల కేంద్రంలోని హోటల్‌లో టీ తాగేందుకు వచ్చిన ఓ వ్యక్తి, డబ్బులు చెల్లించే నెపంతో అతని నుంచే తస్కరించాడు. ఏకంగా ఆ హోటల్‌ నిర్వాహకుడి ఫోన్‌ నుండి గూగుల్‌ పే ద్వారా రూ.96వేలు చోరీ చేశాడు. రాజస్థాన్‌కు చెందిన నారాయణ అనే వ్యక్తి గత ఐదేళ్లుగా అక్కన్నపేట మండల కేంద్రంలో హోటల్‌ నిర్వహిస్తున్నాడు. ఆయన హోటల్‌కు చత్తీస్ ఘడ్‌కు చెందిన ఓ వ్యక్తి టీ తాగేందుకు వచ్చాడు. టీ తాగిన తర్వాత తన వద్ద డబ్బులు లేవని తన మిత్రుడు గూగుల్‌ పే ద్వారా డబ్బు పంపిస్తాడని చెప్పి ఫోన్‌ చేసి నంబర్‌ చెప్పాలని హోటల్‌ నిర్వాహకుడు నారాయణను కోరాడు.

దీంతో ఆ హోటల్‌ నిర్వాహకుడు ఆ వ్యక్తి చెప్పిన నంబర్‌కు ఫోన్‌ చేయడంతో 500 రూపాయలు అవతలి వ్యక్తి గూగుల్‌ పే చేశాడు. అనంతరం సదరు వ్యక్తి హోటల్‌ నిర్వాహకుడిని ఒకసారి ఫోన్‌ ఇవ్వాలని, తన స్నేహితుడికి ఫోన్‌ చేసి మాట్లాడుతానని తీసుకుని నారాయణ గూగుల్‌ పే నుండి రూ.96వేలు తన స్నేహితుడి ఫోన్‌ నంబర్‌కు పంపించాడు. పనిలో పడిన హోటల్‌ నిర్వాహకుడు నారాయణ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత చూసే సరికి తన అకౌంట్‌లో డబ్బులు ఖాళీ అవ్వడంతో షాక్ అయ్యాడు. తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే అక్కన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు హోటల్‌ నిర్వాహకుడు నారాయణ. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..