AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి కొండచిలువను కొరికి నమిలేస్తాయ్.. తాచుపాము కరిచినా ఏం కాదు.. వేటాడి చంపేస్తాయ్

పాములంటే మనందరికీ ప్రాణభయం. కానీ ప్రకృతిలో ఈ విషసర్పాలను కూడా గడగడలాడించే జీవులు ఉన్నాయని మీకు తెలుసా? హనీ బ్యాడ్జర్ ధైర్యం నుండి, సెక్రెటరీ బర్డ్ వేగం వరకు.. పాముల సంఖ్యను నియంత్రించే అద్భుతమైన జీవులు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఆ వివరాలు..

ఇవి కొండచిలువను కొరికి నమిలేస్తాయ్.. తాచుపాము కరిచినా ఏం కాదు.. వేటాడి చంపేస్తాయ్
Snakes
Ravi Kiran
|

Updated on: May 04, 2026 | 5:02 PM

Share

మనం సాధారణంగా బయటకు వెళ్ళినప్పుడు చిన్న పాము కనిపిస్తేనే హడలిపోతాం కదా! అబ్బా.. అసలు ఈ పాములు ఎందుకు పుడతాయో అనుకుంటాం. కానీ, ఒకవేళ ఈ భూమి మీద పాముల సంఖ్యను నియంత్రించే జీవులే లేకపోతే, మన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి. అడుగడుగునా విషసర్పాలే కనిపిస్తాయి. అయితే, ప్రకృతి తనను తాను కాపాడుకోవడానికి కొన్ని ‘స్పెషల్ ఫోర్సెస్’ని తయారు చేసింది. అవేంటంటే..

హనీ బ్యాడ్జర్..

మీరు ఎప్పుడైనా హనీ బ్యాడ్జర్ గురించి విన్నారా? చూస్తే ఒక చిన్న పిల్లిలా ముద్దుగా కనిపిస్తుంది. కానీ, దీని ధైర్యం ముందు సింహం కూడా తోక ముడవాల్సిందే. దీనికి పాము విషం అంటే లెక్కే లేదు. ఏదైనా నాగుపాము వచ్చి దీనికి కాటు వేసినా, కాసేపు మత్తులో పడిపోయి, మళ్ళీ లేచి అదే పామును గుటకాయస్వాహా చేసేస్తుంది. దీని చర్మం ఎంత మందంగా ఉంటుందంటే, పాము కోరలు లోపలికి దిగడమే కష్టం.

పక్షులు, పందులు..

ఇక రోడ్‌రన్నర్ లేదా సెక్రెటరీ బర్డ్ లాంటి పక్షుల వేట చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. సెక్రెటరీ బర్డ్ తన పొడవైన కాళ్లతో పాము తల మీద ఎంత వేగంగా కొడుతుందంటే, అది కోలుకోవడానికి కూడా టైం ఉండదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన ఊర్లలో తిరిగే పందులు. “పందులు ఉన్న చోట పాములు ఉండవు” అని మన పెద్దలు ఊరికే అనలేదు. వాటి శరీరంలోని కొవ్వు పాము విషాన్ని రక్తంలోకి చేరనివ్వదు. అందుకే పందులు పాములను ఈజీగా వేటాడతాయి. కప్పలు పాములను మింగడం, లేదా ఒక పామే మరో పామును తినడం(కింగ్ కోబ్రా లాగా) చూస్తుంటే, ప్రకృతి ఎంత విచిత్రమైనదో అర్థమవుతుంది.

Also Read:

కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!

ట్రెక్కింగ్ చేస్తుండగా కొండ కింద ఏదో నల్లగా కనిపించింది.. అదేంటని దగ్గరకు వెళ్లి చూడగా

Follow Us
వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్.. మీ పిల్లలకు కూడా పెట్టండి!
వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్.. మీ పిల్లలకు కూడా పెట్టండి!
ఇంటి నిండా డబ్బుల కట్టలే.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం
ఇంటి నిండా డబ్బుల కట్టలే.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం
హైస్పీడ్‌ దూసుకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణం!
హైస్పీడ్‌ దూసుకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణం!
వీరు మట్టిని ముట్టినా బంగారమే.. ఈ రాశులు సెప్టెంబర్ మహారాజులు
వీరు మట్టిని ముట్టినా బంగారమే.. ఈ రాశులు సెప్టెంబర్ మహారాజులు
చెప్పిన మాట వినరు.. కష్టాల సుడిగుండంలో చుట్టుకునే రాశులివే
చెప్పిన మాట వినరు.. కష్టాల సుడిగుండంలో చుట్టుకునే రాశులివే
సాయంత్రం ఆకలికి ఈ హెల్తీ స్నాక్‌ ట్రై చేయండి.. 5 నిమిషాల్లో తయారీ
సాయంత్రం ఆకలికి ఈ హెల్తీ స్నాక్‌ ట్రై చేయండి.. 5 నిమిషాల్లో తయారీ
గత మూడు రోజుల్లో బంగారం ధరలు ఎంత పెరిగాయంటే..?
గత మూడు రోజుల్లో బంగారం ధరలు ఎంత పెరిగాయంటే..?
వెయిట్‌ లాస్ సీక్రెట్ రివీల్ చేసిన ఫేమస్ ఇన్‌ప్లూయెన్సర్!
వెయిట్‌ లాస్ సీక్రెట్ రివీల్ చేసిన ఫేమస్ ఇన్‌ప్లూయెన్సర్!
గురువు అనుగ్రహం..ఈ రాశులవారి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు..!
గురువు అనుగ్రహం..ఈ రాశులవారి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు..!
6, 0, 6, 6, 6, 6.. ఓకే ఓవర్లో తుషార్ తుఫాన్ ఇన్నింగ్స్.
6, 0, 6, 6, 6, 6.. ఓకే ఓవర్లో తుషార్ తుఫాన్ ఇన్నింగ్స్.