AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాటింగ్ చేయొద్దని మందలించిన భర్త.. పుట్టింటికి వెళ్లి ప్రియుడితో కలిసి..

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. గతంలో ప్రేమించుకున్న శివ, రేణుక కుటుంబాల అభ్యంతరాలతో విడిపోయారు. రేణుకకు పెళ్లై ఒక చిన్నారి ఉన్నప్పటికీ, మాజీ ప్రియుడితో ఆమె సంబంధాలు కొనసాగించింది. భర్త మందలించడంతో పుట్టింటికి వెళ్ళిన ఆమె, మాజీ ప్రియుడితో కలిసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

చాటింగ్ చేయొద్దని మందలించిన భర్త.. పుట్టింటికి వెళ్లి ప్రియుడితో కలిసి..
Representative Image
SN Pasha
|

Updated on: Jun 13, 2026 | 5:05 PM

Share

నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మాజీ ప్రియుడితో కలిసి ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివ (25), రేణుక (23) గతంలో ప్రేమించుకున్నారు. అయితే వారి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ విడిపోయారు. అనంతరం రెండేళ్ల క్రితం రేణుకకు కుటుంబ సభ్యులు మరో వ్యక్తితో వివాహం జరిపించారు. ప్రస్తుతం ఆమెకు ఏడాది వయస్సున్న కుమార్తె కూడా ఉంది. అయినప్పటికీ శివతో ఆమె అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం రేణుక మొబైల్‌లో చాటింగ్ చేస్తుండగా భర్త గమనించి మందలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆమె మనస్తాపానికి గురై పుట్టింటికి వెళ్లినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రేణుక ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. కొంతసేపటి తర్వాత చిన్నారి ఏడుపు వినిపించడంతో కుటుంబ సభ్యులు మేల్కొని రేణుక కనిపించకపోవడంతో షాకై, ఆమె కోసం వెతికారు. అయితే ఆమె ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం గ్రామ శివారులోని మామిడి తోటలో శివ, రేణుక ఇద్దరూ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర