Munugodu: మునుగోడులో బీజేపీ ఇంటర్నల్ సర్వేలో ఏం తేలిందంటే..? వివేక్ వెంకటస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

|

Sep 24, 2022 | 3:40 PM

Munugodu By-Poll: ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే మునుగోడులో బైపోల్ ప్రచారపర్వం వేడెక్కింది. ప్రధాన పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

Munugodu: మునుగోడులో బీజేపీ ఇంటర్నల్ సర్వేలో ఏం తేలిందంటే..? వివేక్ వెంకటస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
Munugode
Follow us on

Munugodu By-Poll: ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే మునుగోడులో బైపోల్ ప్రచారపర్వం వేడెక్కింది. ప్రధాన పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. విజయం తమదంటే తమదేనంటూ బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. కాగా మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ సారథి వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy) ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ ఫస్ట్ ప్లేస్‌లో ఉందన్న వివేక్.. రెండో స్థానం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొందని వ్యాఖ్యానించారు. మునుగోడులో ప్రధాన పోటీ కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్యే ఉందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తాను స్పందించబోనన్నారు. మునుగోడులో పార్టీ పరంగా ఇంటర్నల్ సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపే ఉన్నారని ఈ సర్వేలో తేలిందన్నారు.

రాజకీయాలకు అతీతంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వివేక్ వెంకటస్వామి అన్నారు. కరోనా పాండమిక్ సమయంలో నియోజకవర్గ ప్రజలకు కోమటిరెడ్డి అండగా నిలిచారన్నారు. తెలంగాణలోనూ బీజేపీ పాలన రావాలని రాష్ట్ర ప్రజానీకం బలంగా కోరుకుంటోందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..