Mobile House: ఇక మీ ఇంటిని మీతోపాటే తీసుకెళ్లొచ్చు.. అదెలాగో ఇక్కడ చూసేయండి..

|

Aug 05, 2022 | 6:56 PM

Mobile House: ఎక్కడో విదేశాల్లో కనిపించే మొబైల్‌ ఇళ్లు ఇప్పుడు ఇండియాకు వచ్చేశాయి. అదికూడా మన హైదరాబాద్‌లో..

Mobile House: ఇక మీ ఇంటిని మీతోపాటే తీసుకెళ్లొచ్చు.. అదెలాగో ఇక్కడ చూసేయండి..
Mobile House
Follow us on

Mobile House: ఎక్కడో విదేశాల్లో కనిపించే మొబైల్‌ ఇళ్లు ఇప్పుడు ఇండియాకు వచ్చేశాయి. అదికూడా మన హైదరాబాద్‌లో.. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అందుకే ఎంతో ఖర్చుపెట్టి తమకు నచ్చిన విధంగా ఇళ్లు నిర్మించుకుంటారు. అలాంటి ఇంటిని ఏదైనా కారణం వల్ల వదిలివెళ్లాల్సి వస్తే… ఆ బాధ వర్ణనాతీతం. ఇప్పుడిక ఆ బాధ అవసరం లేదు. ఎందుకంటే మన ఇంటిని మనతోపాటు తీసుకెళ్లే రోజులు వచ్చేసాయి. అదే మొబైల్‌ హౌస్‌లు. వీటిని హైదరాబాద్‌లోని జీడిమెట్లలో రూపొందిస్తున్నారు.

ఒక ఇల్లు నిర్మించాలంటే ఇసుక, సిమెంట్, కాంక్రీట్, ఇటుకలు, పిల్లర్ల కోసం ఇనుము వాడతారు. కానీ ఈ మొబిలిటీ ఇళ్ళకి కేవలం ఐరన్, చెక్క తో అందమైన మొబైల్ హౌస్ ని నిర్మించుకోవచ్చు. అంత పెద్ద ఇల్లుని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్లడం ఎలా అని ఒక సందేహం ఉంటుంది. కానీ క్రేన్ ల సహాయంతో ఆ ఇల్లుని షిఫ్ట్ చేసుకోవచ్చు. మనకంటూ ఒక స్థలం ఉంటే తక్కువ ఖర్చుతో మనకు నచ్చిన విధంగా ఇల్లు నిర్మించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..