Seethakka: కాన్వాయ్‌ని విడిచి..వాగు దాటిన మంత్రి సీతక్క

| Edited By: Velpula Bharath Rao

Oct 16, 2024 | 9:14 PM

అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొమురంభీం జిల్లాలో పర్యటిస్తున్న ఆదిలాబాద్ ఇంఛార్జ్ మంత్రి సీతక్క ఆసిఫాబాద్ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండి గ్రామంలోని ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవానికి బయలు‌దేరారు. అయితే గుండి గ్రామ సమీపంలోని వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో మంత్రి‌ కాన్వాయ్ వాగును దాటడం అసాధ్యంగా మారింది.

Seethakka: కాన్వాయ్‌ని విడిచి..వాగు దాటిన మంత్రి సీతక్క
Minister Seethakka Crosses The River
Follow us on

అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొమురంభీం జిల్లాలో పర్యటిస్తున్న ఆదిలాబాద్ ఇంఛార్జ్ మంత్రి సీతక్క ఆసిఫాబాద్ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండి గ్రామంలోని ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవానికి బయలు‌దేరారు. అయితే గుండి గ్రామ సమీపంలోని వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో మంత్రి‌ కాన్వాయ్ వాగును దాటడం అసాధ్యంగా మారింది. దీంతో గమ్యస్థానానికి చేరుకునేందుకు బుల్లెట్ ప్రూప్ వాహనాన్ని వదిలేసి ఎలాంటి రక్షణ లేని అటవీశాఖ జీపును ఎక్కారు. అటవిశాఖ జీపు సహకారంతో ఉదృతంగా ప్రవహిస్తున్న గుండి వాగును దాటి గమ్యస్థానం చేరుకున్నారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీసీసీ అద్యక్షుడు విశ్వప్రసాద్, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, డీఈవో, తదితరులు ఉన్నారు.

కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా కేంద్రానికి ఐదు కిలో మీటర్ల దూరంలోనే ఉన్నా.. 16 ఏళ్లుగా గుండి వాగు పై బ్రిడ్జ్ నిర్మాణం జరగడం లేదు. వర్షకాలం వచ్చిదంటే చాలు మూడు నెలలు నరకం చూడక తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గుండి వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని గుండి వాసులు కోరారు. మంత్రి సీతక్క కూడా స్పందించి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

వీడియో ఇదిగో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి